Pallavi Prashanth: ఆ సంతోషం ఎక్కువ రోజులు లేదు.. ఈ సీజన్ కి ఆయనే విజేత...

Pallavi Prashanth: 'బిగ్ బాస్ 7' టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు.'రైతు బిడ్డ' పేరుతో ఆయన బాగా పాప్యులర్ అయ్యాడు. అప్పట్లో బిగ్ బాస్ హౌస్ లో ఆయనను ఎక్కువగా సపోర్ట్ చేసింది శివాజీ.

ఆ సంతోషం ఎక్కువ రోజులు లేదు...
ఆ సంతోషం ఎక్కువ రోజులు లేదు...
  • Entertainment: మరింతగా బాధ పెట్టిన ప్రమాదం..
  • బిగ్ బాస్ 7లో రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్...

'బిగ్ బాస్ 7' టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు.'రైతు బిడ్డ' పేరుతో ఆయన బాగా పాప్యులర్ అయ్యాడు. అప్పట్లో బిగ్ బాస్ హౌస్ లో ఆయనను ఎక్కువగా సపోర్ట్ చేసింది శివాజీ. ప్రశాంత్ ను శివాజీ చేరదీసిన తీరు .. శివాజీ పట్ల ప్రశాంత్ చూపించిన అభిమానం ఆ సీజన్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాంటి పల్లవి ప్రశాంత్ రీసెంట్ గా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు.

"ఒక రైతు బిడ్డ తాను తలచుకుంటే ఏదైనా సాధించగలడు అనే విషయాన్ని నిరూపించడం కోసమే నేను 'బిగ్ బాస్' కి వచ్చాను. బిగ్ బాస్ హౌస్ లో నేను చాలా కష్టపడ్డాను .. ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించారు. టైటిల్ ను గెలుచుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అయితే ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలబడలేదు. ఆ తరువాత జరిగిన సంఘటనలు మా కుటుంబ సభ్యులను చాలా బాధించాయి. అందువలన సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాననే చెప్పాలి" అని అన్నాడు. 

'బిగ్ బాస్' విజేతగా నిలిచిన నేను కేసులు .. జైలు .. కోర్టు అంటూ తిరగవలసి వచ్చింది. మూడేళ్లుగా ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఇక సాయం చేయడానికి వెళ్లి వస్తున్న మాకు ప్రమాదం జరగడం మమ్మల్ని మరింతగా బాధల్లోకి నెట్టింది. ఆ ప్రమాదంలో మా తమ్ముడు చనిపోతాడేమోననే అనుకున్నాము. తెల్లారితే మా తమ్ముడి బర్త్ డే అనగా ఆ ప్రమాదం జరిగింది. మా తమ్ముడిని తీసుకెళ్లింది నేనే కావడంతో, ఆ బాధ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

Tags

Be the first to react

Latest