నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. కేంద్రం కీలక నిర్ణయం..
Parliament Special Session 2026: దేశ రాజకీయాల్లో మరోసారి పార్లమెంట్ సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల నవంబర్ 30న లోక్‌సభను, డిసెంబర్ 3న రాజ్యసభను సమావేశపరచాలని సంబంధిత సభల అధ్యక్షులను కేంద్రం కోరింది. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు. ప్రభుత్వ అత్యవసర కార్యకలాపాలను పూర్తి చేసేందుకు ఈ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 3వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం పిలుపు.. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల కోసమేనా..
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు.. ప్రత్యేక సమావేశాల్లో మోదీ సర్కార్ కీలక అడుగు..
దేశ రాజకీయాల్లో మరోసారి పార్లమెంట్ సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల నవంబర్ 30న లోక్‌సభను, డిసెంబర్ 3న రాజ్యసభను సమావేశపరచాలని సంబంధిత సభల అధ్యక్షులను కేంద్రం కోరింది. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు. ప్రభుత్వ అత్యవసర కార్యకలాపాలను పూర్తి చేసేందుకు ఈ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 3వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు.
కేంద్రం అకస్మాత్తుగా ప్రత్యేక సమావేశాలకు సిద్ధం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు అంశాలకు సంబంధించిన బిల్లులను మరోసారి పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై మళ్లీ చర్చలు
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం కొంతకాలంగా దేశ రాజకీయాల్లో కీలకంగా మారింది. 2023లోనే మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన చట్టం ఆమోదం పొందినప్పటికీ, దాని అమలు నియోజకవర్గాల పునర్విభజన, జనగణన ప్రక్రియతో ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసే దిశగా కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. మహిళా రిజర్వేషన్లతో పాటు లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచడం, నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయించడం వంటి ప్రతిపాదనలు కూడా చర్చలో ఉన్నాయి.
గతంలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు
నిజానికి ఈ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం గతంలోనే పార్లమెంట్‌లో ప్రయత్నం చేసింది. మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు-2026ను ఏప్రిల్ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని సాధించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో ఆ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. ఈ పరిణామం కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా ఎదురుదెబ్బగా మారింది. ఇప్పుడు మరోసారి ఈ ప్రతిపాదనలను పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రత్యేక సమావేశాల్లో ఏం జరగబోతోంది?
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల అజెండాను కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కిరణ్ రిజిజు ప్రకటనలోనూ ఏయే బిల్లులను ప్రవేశపెట్టనున్నారనే వివరాలు లేవు. అయితే మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలు మరోసారి తెరపైకి వచ్చే అవకాశముందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి వైఖరి తీసుకుంటాయి? గతంలో వీగిపోయిన బిల్లులకు ఈసారి అవసరమైన మద్దతు లభిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
మొత్తంగా నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు దేశ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Tags
Be the first to react