హీరో భార్యకు తాప్సీపై అంత కక్ష ఎందుకు? అసలు ఆ బాలీవుడ్ కపుల్ ఎవరు? బయటపడ్డ బాలీవుడ్ దారుణాలు!

Taapsee: ప్రముఖ నటి తాప్సీ తన కెరీర్ ఆరంభంలో బాలీవుడ్‌లో ఎదుర్కొన్న కొన్ని అవమానకరమైన అనుభవాలను పంచుకున్నారు. హీరో భార్యకు తాను నచ్చలేదనే వింత కారణంతో తనను ఓ సినిమా నుంచి తనను తొలగించారని వెల్లడించారు.

హీరో భార్యకు తాప్సీపై అంత కక్ష ఎందుకు? అసలు ఆ బాలీవుడ్ కపుల్ ఎవరు? బయటపడ్డ బాలీవుడ్ దారుణాలు!
హీరో భార్యకు తాప్సీపై అంత కక్ష ఎందుకు? అసలు ఆ బాలీవుడ్ కపుల్ ఎవరు? బయటపడ్డ బాలీవుడ్ దారుణాలు!
  • Entertainment: టైప్‌కాస్ట్ కాకుండా ఉండేందుకు కొన్ని ఆఫర్లు వదులుకుంటున్నట్లు వెల్లడి..

  • కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్‌లో ఎదురైన చేదు అనుభవాలు వెల్లడించిన తాప్సీ... 

Taapsee: బహుముఖ ప్రజ్ఞ కలిగిన కథానాయిక తాప్సీ పన్ను తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టారు. సౌత్ చిత్రసీమతో నటిగా గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత బాలీవుడ్‌లో ప్రవేశించిన ప్రారంభ రోజుల్లో సినీ పరిశ్రమలోని వింత పోకడల కారణంగా పలు అవకాశాలను ఎలా కోల్పోవాల్సి వచ్చిందో ఆమె వివరించారు. ప్రముఖ జర్నలిస్ట్ నయన్‌దీప్ రక్షిత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ ఈ సంచలన విషయాలను పంచుకున్నారు.

సినిమాకు అధికారికంగా సంతకం చేసిన తర్వాత కూడా అనూహ్య కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తొలగించిన తీరును తాప్సీ గుర్తుచేసుకున్నారు.

అనవసర రాజకీయాలు: "ఒక సినిమా ఆఫర్ వచ్చి, అగ్రిమెంట్ పూర్తయ్యాక నన్ను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. అందుకు కారణం ఏంటని ప్రశ్నిస్తే, 'ఆ హీరో భార్యకు మీరు నచ్చలేదు' అని నిర్మొహమాటంగా చెప్పారు. అసలు ఆ హీరో భార్యకు నేను ఎందుకు నచ్చలేదో ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు" అని తాప్సీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

స్నేహితులకు ప్రాధాన్యం: మరో ప్రాజెక్ట్ విషయంలో ఓ ప్రముఖ స్టార్ హీరో, తన స్థానంలో తనకు అత్యంత సన్నిహితురాలైన మరో నటిని తీసుకోవడం కోసం తనను సినిమా నుంచి తొలగించారని తాప్సీ స్పష్టం చేశారు. అయితే వివాదాలకు తావివ్వకుండా ఆ హీరో, ఆయన భార్య ఎవరనే పేర్లను మాత్రం ఆమె వెల్లడించలేదు.

'టైప్‌కాస్ట్' ధోరణిపై స్పష్టమైన వైఖరి..
సినీ పరిశ్రమలో నటీనటులను ఒకే తరహా పాత్రలకు పరిమితం చేసే ('టైప్‌కాస్టింగ్') విధానంపై కూడా తాప్సీ తీవ్రంగా స్పందించారు.

ఆఫర్లను తిరస్కరించడానికి కారణం అదే:
పరిశ్రమలో నటీనటులను కేవలం గ్లామరస్ పాత్రలకో లేదా సీరియస్ రోల్స్‌కో మాత్రమే పరిమితం చేసే ప్రయత్నం జరుగుతుందని తాప్సీ వ్యాఖ్యానించారు. ఒకే శైలి చిత్రాలకు బ్రాండ్ అయిపోకూడదనే ఉద్దేశంతోనే, వైవిధ్యం లేని అనేక ఆఫర్లను తాను స్పష్టంగా తిరస్కరిస్తున్నానని ఆమె తెలిపారు.

ఈ కష్టనష్టాలు, అసమానతలన్నింటినీ దాటుకుంటూ తాప్సీ ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ఇటీవల విడుదలైన 'అస్సి', 'గాంధారి' వంటి చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం.

Tags

Be the first to react

Latest