Minister Durgesh: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో టాలీవుడ్ సత్తా.. విజేతలకు మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు!
Minister Durgesh: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ విశేష ప్రతిభ కనబరచడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో టాలీవుడ్ ఏకంగా 9 అవార్డులు సాధించడం ప్రతి తెలుగు వ్యక్తికి గర్వకారణమని పేర్కొంటూ విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
జాతీయ అవార్డులతో టాలీవుడ్ సత్తా చాటింది: మంత్రి కందుల దుర్గేష్..
ఉత్తమ చిత్రంగా 'కమిటీ కుర్రోళ్లు'.. చిత్ర బృందానికి మంత్రి దుర్గేష్ శుభాకాంక్షలు..
అమరావతి: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ విశేష ప్రతిభ కనబరచడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో టాలీవుడ్ ఏకంగా 9 అవార్డులు సాధించడం ప్రతి తెలుగు వ్యక్తికి గర్వకారణమని పేర్కొంటూ విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, భారతీయ చలనచిత్ర రంగంలో తెలుగు సినిమా మరోసారి తన ప్రత్యేకతను చాటుకుందని అన్నారు. కథ, కథనం, నటన, సాంకేతిక నైపుణ్యం, కాస్ట్యూమ్ డిజైనింగ్, మేకప్, నిర్మాణ విలువలు వంటి అన్ని విభాగాల్లో టాలీవుడ్ తన ప్రతిభను మరోసారి నిరూపించుకుందని కొనియాడారు.
ప్రత్యేకంగా నిహారిక కొణిదెల సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. పల్లెటూరి నేపథ్యంలోని స్నేహం, కుటుంబ బంధాలు, సామాజిక విలువలు, భావోద్వేగాలను హృద్యంగా వెండితెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం చిత్రబృందం సాధించిన గొప్ప విజయమని అన్నారు.
తెలుగు సినిమా కేవలం వాణిజ్య విజయాలకే పరిమితం కాకుండా, నాణ్యమైన కథలు, వినూత్న ఆలోచనలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ జాతీయ పురస్కారాలు తెలుగు సినీ పరిశ్రమలోని కళాకారులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణుల కృషికి దక్కిన గౌరవమని ఆయన పేర్కొన్నారు.
జాతీయ అవార్డుల ద్వారా భారతీయ చలనచిత్ర రంగంలో తెలుగు సినిమా మరోసారి తన జెండాను ఎగురవేసిందని మంత్రి అన్నారు. ఈ విజయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని, రాబోయే రోజుల్లో టాలీవుడ్ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు సాధించి ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.
చివరిగా 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో విజయం సాధించిన నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు మరియు అన్ని చిత్ర బృందాలకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags
Be the first to react
