Meena Sagar: కులాలు, మతాలపై మీనా ఆసక్తికర వ్యాఖ్యలు.. పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్!
Meena comments on caste: కులం, మతం, లింగం వంటి వాటికి కాకుండా... మనిషి ప్రవర్తన, వ్యక్తిత్వానికే సమాజంలో అసలైన ప్రాధాన్యత ఇవ్వాలంటూ ప్రముఖ సినీ నటి మీనా చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- తోటివారి పట్ల చూపే మానవత్వంలోనే నిజమైన గుర్తింపు ఉంటుందన్న మీనా..
- Entertainment: మనిషి ప్రవర్తన, వ్యక్తిత్వానికే ప్రాధన్యత ఇవ్వాలని వ్యాఖ్య...
Meena Sagar: కులం, మతం, లింగం వంటి వాటికి కాకుండా... మనిషి ప్రవర్తన, వ్యక్తిత్వానికే సమాజంలో అసలైన ప్రాధాన్యత ఇవ్వాలంటూ ప్రముఖ సినీ నటి మీనా చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె చెప్పిన సందేశం నెటిజన్ల మనసులను గెలుచుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటోంది.
భర్త మరణం తర్వాత జీవిత విలువలపై క్రమం తప్పకుండా స్పందిస్తున్న మీనా... "కులం, మతం, పుట్టిన ప్రాంతం, లింగం అనేవి మనం పుట్టాక వచ్చి చేరిన గుర్తింపులు మాత్రమే. వాటి సాధన కోసం మనమేమీ కష్టపడలేదు, కాబట్టి వాటిని చూసుకుని గొప్పలు చెప్పుకోవడంలో అర్థం లేదు" అని స్పష్టం చేశారు.
ఒక మనిషి నిజమైన గుర్తింపు అతను చేసే పనులు, తోటివారి పట్ల చూపే మానవత్వంలోనే ఉంటుందని, వాటి గురించే గర్వపడాలని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో ఒక ఉత్తమమైన మనిషిగా ఉండేందుకు ప్రయత్నించాలని కోరారు. సమాజంలో సరైన దృక్పథాన్ని పెంపొందించేలా ఉన్న ఈ భావాలపై ప్రస్తుతం నెట్టింట విశేష చర్చ జరుగుతోంది.
Tags
Be the first to react