Pawan Kalyan: బాలయ్యకు గాయంపై స్పందించిన జనసేనాని.. 'ఎక్స్' వేదికగా పవన్ కల్యాణ్ పోస్ట్ వైరల్!
Pawan Kalyan: హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. 'NBK111' చిత్ర షూటింగ్‌లో బాలకృష్ణ స్వల్పంగా గాయపడిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
- Entertainment: ఇప్పటికే బాలయ్యను పరామర్శించిన చంద్రబాబు, లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్..
- గాయపడిన నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్ష..
Pawan Kalyan: హిందూపురం శాసనసభ్యుడు, నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. 'NBK111' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న తన నూతన చిత్ర షూటింగ్ సెట్స్‌లో నందమూరి బాలకృష్ణ స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిన వెంటనే పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందించారు. బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు, అధికారులను అడిగి తెలుసుకున్నానని, ఆయనకు కండరాల గాయం (Muscle Injury) అయిందని సమాచారం ఉందని పవన్ తెలిపారు. బాలకృష్ణ గారు పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని, మళ్లీ ఉత్సాహంగా సెట్స్‌పైకి రావాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తన ప్రకటనలో పేర్కొన్నారు.
మరోవైపు బాలకృష్ణ గాయపడిన వార్త తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, కుటుంబ సభ్యులైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్‌లు పెట్టారు. ఇటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అటు హిందూపురం నియోజకవర్గ ప్రజలతో పాటు నందమూరి అభిమానులు సైతం తమ అభిమాన కథానాయకుడు త్వరగా కోలుకుని షూటింగ్‌లో పాల్గొనాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.
Tags
Be the first to react