Epic movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లు... 'ఎపిక్' వచ్చేది అప్పుడే!
Epic movie: విజయ్ దేవరకొండ సోదరుడు, యువ నటుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా 'ఎపిక్'. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
- Entertainment: హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం..
- యూకే నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామా..
విజయ్ దేవరకొండ సోదరుడు, యువ నటుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా 'ఎపిక్'. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 11న 'ఎపిక్' చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని హీరో ఆనంద్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. టీజర్ ప్రకారం ఈ కథ యూకే నేపథ్యంలో సాగుతుంది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌గా ఆదిత్య (ఆనంద్ దేవరకొండ), కడలి (వైష్ణవి చైతన్య) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇంగ్లండ్‌లోని బోర్న్‌మత్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్లిన మధ్యతరగతి కుర్రాడిగా ఆనంద్ పాత్ర కనిపిస్తుంది.
టీజర్‌లోని ఓ సన్నివేశం నవ్వులు పూయించింది. తన గదిలో గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్నప్పుడు ఆదిత్యకు ఇండియా నుంచి తల్లిదండ్రులు వీడియో కాల్ చేస్తారు. షర్ట్ లేకుండా ఉన్న కొడుకును చూసి తండ్రి (శివాజీ) మందలించడం, దానికి ఆదిత్య తాను వర్కౌట్ చేస్తున్నానని అబద్ధం చెప్పడం సరదాగా అనిపించింది. ఈ టీజర్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. అజీమ్ మహమ్మద్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
Tags
Be the first to react