⚡ BREAKING

50 ఏళ్ళ లోనూ ఇరగదీస్తున్న ఐశ్వర్య! పారిస్ ఫ్యాషన్ వీక్ లో మహారాణి లుక్ లో మెరుపులు!

Paris Fashion Week: ప్రపంచ ఫ్యాషన్ వేదికపై భారతీయ అందానికి మరోసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. బాలీవుడ్‌ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ పారిస్ ఫ్యాషన్ వీక్‌లో తనదైన శైలిలో మెరిశారు. సోమవారం జరిగిన ఫ్యాషన్ షోలో రన్‌వేపై అడుగుపెట్టిన ఆమె.. తన లుక్‌తో అక్కడి ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా ఆకర్షించారు.

Aishwarya rai’s Royal Look in Paris
Aishwarya rai’s Royal Look in Paris
  • పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఐశ్వర్యారాయ్.
  • 3డీ ఫ్రింజ్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన ప్రత్యేక గౌన్.

Paris Fashion Week: ప్రపంచ ఫ్యాషన్ వేదికపై భారతీయ అందానికి మరోసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. బాలీవుడ్‌ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ పారిస్ ఫ్యాషన్ వీక్‌లో తనదైన శైలిలో మెరిశారు. సోమవారం జరిగిన ఫ్యాషన్ షోలో రన్‌వేపై అడుగుపెట్టిన ఆమె.. తన లుక్‌తో అక్కడి ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా ఆకర్షించారు.

నలుపు రంగు ఫ్లోయింగ్ గౌన్‌లో రన్‌వేపై నడిచిన ఐశ్వర్య.. సాధారణ గ్లామర్‌కు భిన్నంగా రాచరికపు హంగులతో కనిపించారు. ఆమె ధరించిన డిజైనర్ దుస్తులు, కేప్‌, తలపై మెరిసిన కిరీటం.. మొత్తం లుక్‌కు రాజసాన్ని అద్దాయి. రన్‌వేపై ఆమె నడక, హావభావాలు కలగలిసి ఐశ్వర్యను ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిపాయి.

క్వీన్‌లా మెరిసిన ఐశ్వర్య..

‘ఎక్స్‌ప్రెస్ యువర్ వర్త్’ అనే థీమ్‌కు అనుగుణంగా రూపొందించిన తాజా కలెక్షన్‌లోని దుస్తులను ఐశ్వర్య ధరించారు. సెలబ్రిటీ స్టైలిస్ట్ మోహిత్ రాయ్ రూపొందించిన ఈ ప్రత్యేక లుక్‌లో ఆమె రెండు భాగాల వెల్వెట్ గౌన్‌లో కనిపించారు. గౌన్‌పై 3డీ ఫ్రింజ్ ఎంబ్రాయిడరీ, ప్రత్యేకమైన నెక్‌లైన్‌ డిజైన్‌ దుస్తులకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి.

దీనికి జోడీగా వెల్వెట్ కేప్‌, వజ్రాలతో అలంకరించిన కిరీటం, ఆకట్టుకునే రింగులు ఆమె రాచరికపు లుక్‌ను మరింత ఇనుమడింపజేశాయి. నలుపు రంగు దుస్తులకు భిన్నంగా ఎరుపు ఛాయలతో కనిపించిన ఆమె జుట్టు కూడా ఈ లుక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సోషల్ మీడియాలో వైరల్..

ఐశ్వర్యారాయ్ కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలను స్టైలిస్ట్ మోహిత్ రాయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాచరికపు దర్పం ఉట్టిపడేలా ఐశ్వర్య క్వీన్‌లా కనిపిస్తున్నారంటూ ఆయన ప్రశంసించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు, ఫ్యాషన్ ప్రియులు ఐశ్వర్య లుక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

పారిస్ వేదికపై ఐశ్వర్యకు ప్రత్యేక గుర్తింపు

పారిస్ ఫ్యాషన్ వీక్‌తో ఐశ్వర్యారాయ్‌కు అనుబంధం కొత్తది కాదు. కొన్నేళ్లుగా లారియాల్ పారిస్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై ఆమె సందడి చేస్తున్నారు. గత ఫ్యాషన్ వీక్‌లో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన దుస్తుల్లో కనిపించి ఆకట్టుకున్న ఐశ్వర్య.. ఈసారి మాత్రం పూర్తిగా రాచరికపు లుక్‌లో దర్శనమిచ్చి మరోసారి తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ను చాటుకున్నారు.

ప్రపంచ ఫ్యాషన్‌ వేదికపై భారతీయ అందం, సంప్రదాయ హుందాతనాన్ని తనదైన శైలిలో ఆవిష్కరిస్తూ వస్తున్న ఐశ్వర్యారాయ్.. ఈసారి కూడా పారిస్ రన్‌వేపై తనదైన ముద్ర వేశారు.

Tags

Be the first to react

Latest