Arunachalam: గిరిప్రదక్షిణలో చేసే చిన్న పొరపాట్లు.. కలిగే దోషాల గురించి మీకు తెలుసా? Tirumala Darshanam Timings: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు! Srisailam: శ్రీశైల మల్లన్నకు కాసుల వర్షం..! రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం! Hindu Mythology: తిరుమల రహస్యం.. 200 కోట్ల ఏళ్ల చరిత్ర కలిగిన కలియుగ వైకుంఠం వెనుక ఉన్న అసలు కథ! ప్రపంచంలోనే మొట్టమొదట ఈద్ ఎక్కడ మొదలవుతుంది? ఆ దేశం స్పెషాలిటీ ఏంటి? Ramzan festival 2026: అరేబియాలో ఒకలా.. ఇండియాలో మరోలా! ఈద్ తేదీల్లో మార్పు వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు ఫుల్! Tirupati: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..! ఆధునిక టెక్నాలజీతో లగేజీ ట్రాకింగ్..! Pooja Gadi: దేవుడి ఫోటోలను ఎలా శుభ్రం చేయాలి? ఫ్రేమ్‌లు పాడవకుండా ఉండే మార్గాలు..! Tirumala: నేడు శ్రీవారి ఆలయంలో 'ఉగాది ఆస్థానం'! తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ... Arunachalam: గిరిప్రదక్షిణలో చేసే చిన్న పొరపాట్లు.. కలిగే దోషాల గురించి మీకు తెలుసా? Tirumala Darshanam Timings: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు! Srisailam: శ్రీశైల మల్లన్నకు కాసుల వర్షం..! రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం! Hindu Mythology: తిరుమల రహస్యం.. 200 కోట్ల ఏళ్ల చరిత్ర కలిగిన కలియుగ వైకుంఠం వెనుక ఉన్న అసలు కథ! ప్రపంచంలోనే మొట్టమొదట ఈద్ ఎక్కడ మొదలవుతుంది? ఆ దేశం స్పెషాలిటీ ఏంటి? Ramzan festival 2026: అరేబియాలో ఒకలా.. ఇండియాలో మరోలా! ఈద్ తేదీల్లో మార్పు వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు ఫుల్! Tirupati: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..! ఆధునిక టెక్నాలజీతో లగేజీ ట్రాకింగ్..! Pooja Gadi: దేవుడి ఫోటోలను ఎలా శుభ్రం చేయాలి? ఫ్రేమ్‌లు పాడవకుండా ఉండే మార్గాలు..! Tirumala: నేడు శ్రీవారి ఆలయంలో 'ఉగాది ఆస్థానం'! తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ...

Bhagavad Gita: అజ్ఞానాంధకారం తొలగించే వారే గురువు.. దుఃఖానికి ఒకే ఒక మూలకారణం అజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 3!

ఓం వ్యాసదేవాయ నమః ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో

Published : 2025-09-15 17:59:00

ఓం వ్యాసదేవాయ నమః 

ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,

సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..

సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 3వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.

ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.

ఓం వ్యాసదేవాయ నమః 

పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో 

శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళి

3. ఓం సద్గురు స్వరూపిణ్యై నమః

అర్థం: పరమాత్మ స్వరూపిణియైన శ్రీమద్భగవద్గీత సద్గురువు.

గుకారశ్చాంధకారస్తు 

రుకారస్తన్నిరోధకృత్‌ ।

అంధకార వినాశిత్వాత్‌ గురురిత్యభిధీయతే ॥

          - గురు గీత

అర్థం :‘గు‘ అనగా చీకటి. ‘రు’ అనగా దానిని నిరోధించేది. అజ్ఞానాంధకారం తొలగించే వారే గురువు. దుఃఖానికి ఒకే ఒక మూలకారణం అజ్ఞానం అని తెలిపి, దాని నుంచి బయటపడటానికి శ్రేయస్కరమైన బోధ చేసేవారే సద్గురువు. గురువు సాక్షాత్తు త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మ స్వరూపమే.

ఈ లోకంలో ఎప్పుడు ఎక్కడ ఏ సద్గురువు ఆధ్యాత్మిక విద్యను బోధించినా ఆ విద్య భగవద్గీతా స్వరూపమే. ఇక్కడ వసిష్ఠగీత, గురు గీత, అష్టావక్ర గీత మొదలు అనేక గీతలు ఉన్నాయి. ఈ గీతలన్నీ ఎందరో మహర్షులు వారి వారి శిష్యులకు బోధించినవే. ఏ బోధ అయినా చక్కగా, శాస్త్ర ప్రమాణంగానే చేస్తారు సద్గురువు. గురువు శాస్త్ర స్వరూపం. శాస్త్రం గురు స్వరూపం. 

ఇక్కడ ప్రామాణికమైన శాస్త్రం భగవద్గీత. వేదసారమైన భగవద్గీత భగవాన్‌ ఉవాచ. అంటే స్వయంగా ఆ తండ్రి ముఖారవిందం నుండి వచ్చింది. లోకమంతా నీవు అల్పుడివి అని చెపుతున్నప్పుడు, నా తల్లి శ్రీమద్భగవద్గీత, ‘నీవు అనంతమైన ఆత్మ స్వరూపానివి’ అని నన్ను నాకు పరిచయం చేసింది. ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో బోధపరిచింది. అపారమైనది నా గురుమహిమ!

ఏదీ ఆశించకుండా, ఎల్లలు లేని పరిపూర్ణమైన ప్రేమతో జ్ఞానబోధ చేస్తున్న సద్గురు స్వరూపిణి అయిన నా తల్లికి వినయంతో వందనం చేస్తున్నాను.

ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం గీతామాతను గుర్తు చేసుకొంటూ, ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన సాక్షాత్తు విష్ణు స్వరూపులైన వ్యాసదేవులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

జై గురుదేవ్ 

Link 1 : Bhagavad Gita: ప్రతి రోజూ ఒక్కో నామం.. ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-1

link 2 : Bhagavad Gita: పరమాత్మ శక్తిమంతుడు.. గీతామాత పరాశక్తి స్వరూపిణి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 2!

Spotlight

Read More →