LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Devotional

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి.

Kasthuri S 1 min read
Tirumala
Tirumala

గోవింద నామస్మరణతో మార్మోగుతున్న తిరుమల.. భారీగా తరలివచ్చిన భక్తులు..

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం.. 30 కంపార్ట్మెంట్లు నిండిన క్యూ లైన్లు..

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి.

ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు ఉదయం 8 గంటల తర్వాత దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది.

భక్తుల రద్దీ మధ్య కూడా టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. మంగళవారం శ్రీవారిని 91,478 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,376 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం ద్వారా నిన్న రూ.5.04 కోట్లు లభించింది. 

అదేవిధంగా భక్తులకు మొత్తం 4.15 లక్షల లడ్డూలను విక్రయించారు. తిరుమలలో అన్నప్రసాద సేవను కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వినియోగించుకున్నారు. నిన్న 2.60 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ అన్ని ఏర్పాట్లు కొనసాగిస్తోంది.

Be the first to react

More Coverage

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్న భక్తులు!

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్న భక్తులు!

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగు…