LIVE
Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  •  Retirement Age: పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు.. హైకోర్టు కీలక తీర్పు!  •  Health Tips: వీటిలో వాటర్ తాగుతున్నారా... అయితే వాటిని కొనితెచ్చుకున్నట్లే!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Devotional

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం!

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి, ఆక్టోపస్ బిల్డింగ్ వరకు భక్తులు క్యూ లైన్‌లో వేచి ఉన్నారు.

Kasthuri S 1 min read
Tirumala
Tirumala

తిరుమల క్షేత్రంలో భక్తి ప్రవాహం.. ఒక్కరోజే 74 వేల మందికి దర్శనం..

శ్రీవారి సేవలో భక్తజనం.. హుండీ ఆదాయం రూ.4.64 కోట్లు..

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి, ఆక్టోపస్ బిల్డింగ్ వరకు భక్తులు క్యూ లైన్‌లో వేచి ఉన్నారు.

శనివారం ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం పడుతుందని, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల వరకు సమయం పడుతోందని వెల్లడించారు.

భక్తుల రద్దీ ఉన్నప్పటికీ తిరుమలలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ దర్శన ప్రక్రియను సజావుగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గత రోజు మొత్తం 74,636 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి భక్తి శ్రద్ధలతో 43,084 మంది తలనీలాలు సమర్పించారు.

హుండీ ద్వారా స్వామివారికి వచ్చిన ఆదాయం రూ.4.64 కోట్లుగా నమోదైంది. అలాగే భక్తుల కోసం విక్రయించిన లడ్డూల సంఖ్య 4.21 లక్షలుగా ఉంది.

తిరుమలలో భక్తుల సేవలో భాగంగా అన్నప్రసాద కార్యక్రమం ద్వారా నిన్న 3.18 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా వివిధ కారణాలతో 4,253 మంది భక్తులు వైద్య సేవలు పొందారు.

భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలకు వచ్చే భక్తులు ఓపికతో ఉండాలని, టీటీడీ సూచనలను పాటించాలని అధికారులు కోరారు.

Be the first to react

More Coverage

Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!

Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!

Srisailam: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబా మల్లికార్జున స్వామి దేవస్థానం గత రెండు ఆర్థిక…

Ram Mohan Naidu

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా విమానం AI-171 ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శ…

Minister Narayana

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…