దావోస్ నుంచి నేరుగా సచివాలయానికి.. విశ్రాంతి లేకుండా రంగంలోకి దిగిన చంద్రబాబు! బ్యాంకర్లతో కీలక భేటీ.. ఏపీలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' యుగం.. 2035 నాటికి 'డే-జీరో రెడీ స్టేట్'గా ఆంధ్రప్రదేశ్! Nara Lokesh: దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల ఐక్యత…! రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్! దావోస్‌లో చంద్రబాబు 'స్పీడ్'.. అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఏపీలో టూరిజం విప్లవం! అంతర్జాతీయ సంస్థల క్యూ.. దావోస్‌లో ట్రంప్ గ్రాండ్ డిన్నర్.. భారతీయ దిగ్గజాలకు అరుదైన ఆహ్వానం! దావోస్‌లో చంద్రబాబు 'టెక్' మార్క్.. అమరావతికి ఐబీఎం క్వాంటం సెంటర్.. 10 లక్షల మంది యువతకు ఏఐ శిక్షణ! దావోస్‌లో లోకేశ్ విజన్.. ఆవిష్కరణలే రాష్ట్రానికి ఊపిరి.. ఏపీలో బలమైన 'ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్'! దావోస్‍లో చంద్రబాబు 'గ్రోత్ స్టోరీ'.. 2026లో ఏపీలో డ్రోన్ అంబులెన్స్.. పెట్టుబడులకు స్వర్గధామం నవ్యాంధ్ర! రాష్ట్రానికి రండి... పరిస్థితులు గమనించండి.. బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్! పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు దావోస్‌లో చంద్రబాబు మార్క్ డీల్.. ఏపీలో 40 యూఏఈ సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్! తొలి సీఎంగా రికార్డు.. దావోస్ నుంచి నేరుగా సచివాలయానికి.. విశ్రాంతి లేకుండా రంగంలోకి దిగిన చంద్రబాబు! బ్యాంకర్లతో కీలక భేటీ.. ఏపీలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' యుగం.. 2035 నాటికి 'డే-జీరో రెడీ స్టేట్'గా ఆంధ్రప్రదేశ్! Nara Lokesh: దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల ఐక్యత…! రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్! దావోస్‌లో చంద్రబాబు 'స్పీడ్'.. అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఏపీలో టూరిజం విప్లవం! అంతర్జాతీయ సంస్థల క్యూ.. దావోస్‌లో ట్రంప్ గ్రాండ్ డిన్నర్.. భారతీయ దిగ్గజాలకు అరుదైన ఆహ్వానం! దావోస్‌లో చంద్రబాబు 'టెక్' మార్క్.. అమరావతికి ఐబీఎం క్వాంటం సెంటర్.. 10 లక్షల మంది యువతకు ఏఐ శిక్షణ! దావోస్‌లో లోకేశ్ విజన్.. ఆవిష్కరణలే రాష్ట్రానికి ఊపిరి.. ఏపీలో బలమైన 'ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్'! దావోస్‍లో చంద్రబాబు 'గ్రోత్ స్టోరీ'.. 2026లో ఏపీలో డ్రోన్ అంబులెన్స్.. పెట్టుబడులకు స్వర్గధామం నవ్యాంధ్ర! రాష్ట్రానికి రండి... పరిస్థితులు గమనించండి.. బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్! పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు దావోస్‌లో చంద్రబాబు మార్క్ డీల్.. ఏపీలో 40 యూఏఈ సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్! తొలి సీఎంగా రికార్డు..

దావోస్‌లో చంద్రబాబు 'స్పీడ్'.. అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఏపీలో టూరిజం విప్లవం! అంతర్జాతీయ సంస్థల క్యూ..

స్విట్జర్లాండ్‌లోని దావోస్ మంచు కొండల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జెండా రెపరెపలాడుతోంది. ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF) మూడో రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అ

2026-01-21 20:22:00
Elections: ఎన్నికల ముందు అధికార యంత్రాంగానికి షాక్‌…! 47 మున్సిపల్ కమిషనర్ల ట్రాన్స్‌ఫర్!

స్విట్జర్లాండ్‌లోని దావోస్ మంచు కొండల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జెండా రెపరెపలాడుతోంది. ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF) మూడో రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత బిజీగా గడిపారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ప్రపంచ దిగ్గజ సంస్థల అధినేతలతో ఆయన జరిపిన చర్చలు ఫలించాయి. కేవలం మాటలకే పరిమితం కాకుండా, భారీ ప్రాజెక్టుల శంకుస్థాపనకు తేదీలను కూడా ఖరారు చేయడం విశేషం.

Pesonal Loan: సిబిల్ స్కోర్ 750 ఉన్నా పర్సనల్ లోన్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది?

దావోస్‌లోని ఏపీ లాంజ్ వేదికగా ఒక చారిత్రాత్మక భేటీ జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత అర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ కూడా పాల్గొన్నారు.

LLB Jobs: సుప్రీం కోర్టులో లా క్లర్క్ నియామకాలు.. మిస్ చేసుకోకండి!

అనకాపల్లి జిల్లాలో అర్సెల్లార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థ భారీ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించనుంది. తొలి దశలోనే సుమారు రూ. 60,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులను ఫిబ్రవరి 15లోగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి రెండో వారంలోనే ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. కేంద్రం నుంచి ఏవైనా అనుమతులు అవసరమైతే తానే స్వయంగా ఢిల్లీ వెళ్లి సాధిస్తానని సీఎం హామీ ఇచ్చారు.

Industrial Park: సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్... ఏపీలో ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్!

ప్లాంట్ పనుల పురోగతిని ఐటీ శాఖ మంత్రి లోకేష్ నిరంతరం ట్రాక్ చేస్తున్నారని ఆదిత్య మిట్టల్ ఈ సందర్భంగా అభినందించారు. పర్యాటక రంగాన్ని కేవలం వినోదంగా కాకుండా ఒక పరిశ్రమగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు సంకల్పించారు. ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ 'తమారా లీజర్' సీఈవో సృష్టి శిబులాల్‌తో ఆయన భేటీ అయ్యారు.

Sunita Williams: ఇదే నా బెస్ట్ హోమ్‌కమింగ్... సునీతా విలియమ్స్ పోస్ట్ వైరల్!

పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించామని, దీనివల్ల కరెంటు ఛార్జీలు, పన్నుల్లో రాయితీలు లభిస్తాయని సీఎం వివరించారు. గోదావరి తీరప్రాంతం (పోలవరం నుంచి భద్రాచలం వరకు), కోనసీమ అందాలు, గండికోట గ్రాండ్ కాన్యన్, అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో లగ్జరీ రిసార్టులు, హోటళ్ల ఏర్పాటుకు అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

Women Empowerment: ఏపీలో మహిళలకు బంపర్ ఆఫర్! రూ. 10 లక్షల రుణం.. 35% సబ్సిడీ!

ప్రతి పర్యాటక కేంద్రానికి రహదారులు, సమీపంలో విమానాశ్రయాల సౌకర్యం ఉందని, పెట్టుబడిదారులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. కేవలం భారీ పరిశ్రమలే కాకుండా, ఐటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కూడా ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చడానికి బాబు బృందం కృషి చేస్తోంది. డేటా సెంటర్లు, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటుపై ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి.

India Spain Relations: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల ఐక్యత అవసరం.. విదేశాంగ మంత్రి జైశంకర్!!

ఎకో-టూరిజం, హోమ్ స్టే లపై తమారా ఆసక్తి
ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై తమారా లీజర్ సంస్థ సానుకూలంగా స్పందించింది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పర్యావరణ హితమైన 'ఎకో-టూరిజం' పార్కులు ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. విశాఖపట్నం సహా ఇతర ప్రాంతాల్లో 'హోమ్ స్టే' ప్రాజెక్టులు చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. 'కమ్యూనిటీ ఫస్ట్' అనే నినాదంతో గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, వారిని కూడా ఈ ప్రాజెక్టులలో భాగస్వాములను చేస్తామని సీఎంకు వివరించారు. సరైన ప్రతిపాదనలతో వస్తే పూర్తి సహకారం అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నైపుణ్యాభివృద్ధి
టెక్నాలజీ రంగంలోనూ ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో కాలిబో ఏఐ అకాడెమీ వ్యవస్థాపకులు రాజ్ వట్టికూటి, సీఈవో స్కాట్ శాండ్స్ఛఫెర్ తో సీఎం చర్చలు జరిపారు. ఇప్పటికే వట్టికూటి ఫౌండేషన్ భాగస్వామ్యంతో అమరావతిలో ఏఐ అకాడెమీ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాలకు కూడా విస్తరించి, మరింత మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సీఎం ప్రతిపాదించారు. విశాఖపట్నం మధురవాడలోని ఐటీ సెజ్ లో ఒక 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని కాలిబో సంస్థను చంద్రబాబు ఆహ్వానించారు.

Jana Sena Leader: దమ్ముంటే బహిరంగ చర్చకు రా’…! ఏబీకి బొలిశెట్టి ఓపెన్ ఛాలెంజ్!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ఏపీ పారిశ్రామిక భవిష్యత్తుకు కొత్త పునాది వేస్తోంది. రూ. 60 వేల కోట్ల స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులు వస్తే వేల సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" నినాదంతో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం, ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మారుస్తోంది.

India-UAE: మోదీ మాస్టర్ స్ట్రోక్.. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ దూసుకెళ్తోంది.. యూఏఈతో మెగా డీల్!
7000mAh బ్యాటరీతో ఒప్పో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!
భూముల మార్కెట్ విలువను మరోసారి పెంచిన ఏపీ ప్రభుత్వం.. పెరుగుతున్న ఆస్తుల విలువ - ఎక్కడెక్కడ పెరగనున్నాయి?
refrigerate Tips: ఫ్రిజ్‌లో పెట్టకూడని ఆహారాలు ఇవే… తెలియకపోతే ఇంక అంతే షుగర్ పేషెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిందే..!!

Spotlight

Read More →