దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈరోజు స్వల్ప తగ్గుదల నమోదైంది. నిన్నటి రేట్లతో పోలిస్తే సుమారు రూ.10 మేర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ వంటి అంశాలు ఈ తగ్గుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు:
ఈరోజు (శనివారం) భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹12,436గా, 22 క్యారెట్ల ధర ₹11,399గా, 18 క్యారెట్ల బంగారం ₹9,327గా ఉంది.
10 గ్రాముల బంగారం ధరలు క్రింది విధంగా నమోదయ్యాయి:
24 క్యారెట్లు: ₹1,24,360 నిన్నటి ₹1,24,370తో పోలిస్తే ₹10 తగ్గింది
22 క్యారెట్లు: ₹1,13,990 నిన్నటి ₹1,14,000తో పోలిస్తే ₹10 తగ్గింది
18 క్యారెట్లు: ₹93,270 (నిన్నటి ₹93,280తో పోలిస్తే ₹10 తగ్గింది
విజయవాడ:
ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు ₹12,436గా, 22 క్యారెట్ల బంగారం ధర ₹11,399గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ₹9,327 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నం
ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ₹12,430, 22 క్యారెట్ల ధర ₹11,392, 18 క్యారెట్ల బంగారం ₹9,320గా ఉంది.
హైదరాబాద్
24 క్యారెట్ల బంగారం ధర ₹12,440, 22 క్యారెట్ల ధర ₹11,402గా నమోదైంది.
ముంబై
బంగారం ధర 24 క్యారెట్లకు ₹12,436, 22 క్యారెట్లకు ₹11,399గా ఉంది.
చెన్నై
24 క్యారెట్ల బంగారం ధర ₹12,771, 22 క్యారెట్ల ధర ₹11,706గా ఉంది.
బెంగళూరు
24 క్యారెట్ల బంగారం ₹13,072ప్రతి గ్రాముకు22 క్యారెట్ల బంగారం ₹11,982.67 ఉంది
బంగారం రేట్లు ఎప్పటికప్పుడు చూసుకొని కొనుగోలు చేసుకోవాల్సిందిగా సూచన.
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
ఇంధన ధరలు దేశంలోని ప్రధాన నగరాల్లో పెద్ద మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి.
విజయవాడ :
పెట్రోల్ ₹109.34/లీటర్, డీజిల్ ₹97.02/లీటర్
హైదరాబాద్:
పెట్రోల్ ₹108.20/లీటర్, డీజిల్ ₹96.60/లీటర్
చెన్నై:
పెట్రోల్ ₹100.79/లీటర్, డీజిల్ ₹92.38/లీటర్
ముంబై:
పెట్రోల్ ₹106.31/లీటర్, డీజిల్ ₹94.27/లీటర్
ఆయిల్ మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా ఉండటంతో ఇంధన ధరల్లో పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు.
స్టాక్ మార్కెట్లో స్వల్ప లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి.
BSE Sensex: 84,211.88 వద్ద ముగిసింది.
NSE Nifty 50: 25,795.15 వద్ద ట్రేడింగ్ ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్ సూచీలు, అమెరికా వడ్డీ రేట్ల ప్రకటనలు, మరియు ద్రవ్యోల్బణం పరిస్థితులు మార్కెట్ దిశను ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆర్థిక నిపుణులు చెబుతున్నట్లుగా, బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల ఫెస్టివ్ సీజన్ ముందు కొనుగోలు అవకాశాన్ని కల్పించవచ్చు. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండటం వినియోగదారులకు ఊరటనిస్తున్నాయి.