Express Ways: ప్రపంచంలోనే పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే నెట్‌వర్క్‌లు ఉన్న టాప్ 10 దేశాలు! ఆసియా నుండి..

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మొదట్లో ఈ ఘటన వెనుక కారణం ఏమిటో స్పష్టంగా తెలియలేదు. అయితే, పోలీసులు చేసిన దర్యాప్తులో నిజం బయటపడింది. శివశంకర్ మిత్రుడు ఎర్రిస్వామిని విచారించగా కీలక వివరాలు బయటకు వచ్చాయి. ఎర్రిస్వామి ఇచ్చిన వివరాల ప్రకారం, ప్రమాదానికి ముందు బైక్‌లో పెట్రోలు పోసి బంక్‌ నుంచి బయలుదేరారు. 

Cyclone Holiday: ఏపీలో స్కూళ్లకు మూడు రోజుల సెలవులు! ఆ ప్రాంతాల వారికి రెడ్ అలెర్ట్!

ఆ తర్వాత బైక్‌ను శివశంకర్ నడిపాడు. అయితే రోడ్డుపై ఉన్న ఇసుక కారణంగా బైక్ స్కిడ్ అయి కుడి వైపున ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో శివశంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎర్రిస్వామి మాత్రం తీవ్రంగా గాయపడినా, భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ సమయంలో రోడ్డుపై పడిన బైక్‌ను గుర్తించని బస్సు డ్రైవర్ దానిని ఈడ్చుకుంటూ వెళ్లడం వల్ల పెద్ద ప్రమాదం జరిగింది.

Bhagavad Gita: తామరాకును నీరు అంటక.. గీతాధ్యానం చేసేవారికి పాపం తగదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -43!

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఘటనలో పలు మంది గాయపడి, కొందరిని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తక్షణమే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మొదట్లో బస్సు లోపాల వలన ప్రమాదం జరిగిందని భావించినా, విచారణలో మానవ తప్పిదమే కారణమని తేలింది.

Win India: RO-KO కాంబినేషన్ అద్భుతం.. భారత్‌కి ఘన విజయం!

ఈ ప్రమాదం నేపథ్యంలో బాలీవుడ్ నటుడు, సేవా కార్యక్రమాలతో ప్రసిద్ధి చెందిన సోనూసూద్ స్పందించారు. ఆయన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ట్విట్టర్ ద్వారా ఓ విజ్ఞప్తి చేశారు. లగ్జరీ బస్సుల భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. “ప్రతి లగ్జరీ బస్సులో ఎమర్జెన్సీ డోర్ ఎలక్ట్రానిక్ కాకుండా మాన్యువల్‌గా ఉండాలి. ఆపరేటర్లకు నెలరోజుల గడువు ఇవ్వండి. పర్మిట్ రీన్యూవల్ సమయంలో ఆపరేటర్లు ఎమర్జెన్సీ డోర్ మార్పులు చేసినట్లు ఫోటోలు అప్లోడ్ చేయాలి. ఇది ప్రయాణికుల భద్రత కోసం చాలా అవసరం” అని సోనూసూద్ ట్వీట్ చేశారు.

ఏపీలో 182 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహం ప్లాన్! ప్రభుత్వం ముందడుగు

అతని ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనేక మంది నెటిజన్లు సోనూసూద్ అభిప్రాయానికి మద్దతు తెలుపుతున్నారు. “ఇది చాలా అవసరమైన సూచన”, “ప్రాణ రక్షణ కోసం ఇలాంటి మార్పులు తప్పనిసరిగా చేయాలి” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, రోడ్డు భద్రతపై అవగాహన పెంచే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Chiranjeevi: కోర్టు కీలక ఆదేశాలు! చిరంజీవి ఫోటోలు, వాయిస్‌, పేరు వాడితే కఠిన చర్యలు!

ఈ ఘటన మరోసారి రోడ్డు ప్రమాదాలపై ప్రశ్నలు లేవనెత్తింది. సాంకేతిక లోపాలు, నిర్లక్ష్యం, మానవ తప్పిదాలు ఏ కారణం అయినా ప్రాణనష్టం మాత్రం తప్పటం లేదు. కర్నూలు ఘటన పాఠం కావాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలతో పాటు అధికారులు కూడా కోరుతున్నారు.

CBN: ప్రవాసులతో సీఎం చంద్రబాబు ఫోటో సెషన్! ఆయన ఓపికకు ఫిదా అయిన ప్రవాసులు!
E-Commerce Traps: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో మోసపోకుండా ఉండాలంటే..! ఇవి తప్పక తెలుసుకోండి..!
BFI Initiative: పరిశోధనలో అత్యుత్తమ నిపుణులకు ప్రత్యేక అవకాశం.. 3 కోట్లు గ్రాంట్‌తో..! త్వరగా నామినేట్ చేయండి..!
AP Government: ఏపీ ప్రభుత్వం మరో పథకం! ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు... అర్హతలు ఇవే!
Rains: వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక! ఆ 5 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
భారతదేశానికి కొత్త 'స్వర్ణ రాజధాని'.. ఆ ఒక్క జిల్లాలోనే 222 టన్నుల స్వచ్ఛమైన బంగారం! దేశంలోనే అతిపెద్ద గని!
రాష్ట్రానికి జాక్‌పాట్.. నాలుగు నగరాల్లో ఏడు రోజుల పర్యటన.. త్వరలోనే కీలక భాగస్వామ్యాలు కుదిరే ఛాన్స్!