టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన విషయం అక్కినేని నాగచైతన్య వ్యక్తిగత జీవితం. కింగ్ నాగార్జున వారసుడిగా జోష్ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగచైతన్య, ఏం మాయ చేసావె చిత్రంతో యూత్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ చిత్రం ద్వారా పరిచయమైన నటి సమంతను 2017లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. అయితే, 2021లో ఈ జంట విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.
విడాకుల తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్న నాగచైతన్య, గత సంవత్సరంలో (డిసెంబర్ 2024లో) మరో నటి శోభితా ధూళిపాళను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. శోభితా అటు హిందీ, ఇటు తెలుగు, మరోవైపు తమిళ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఇటీవల మణిరత్నం రూపొందించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు దక్కింది.
చాలా కాలంగా ప్రేమలో ఉన్న నాగచైతన్య మరియు శోభితా, తమ బంధాన్ని వివాహంతో పటిష్టం చేసుకున్నారు. గతేడాది డిసెంబర్‌లో మ్యారేజ్ చేసుకున్న ఈ జంట ఇటీవల తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఇటీవల గుడికి వెళ్లిన ఫోటోలను కూడా చైతూ మరియు శోభితా తమ సోషల్ మీడియా ద్వారా పంచుకుని తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
పెళ్లి తర్వాత సంతోషంగా జీవిస్తున్న ఈ జంటకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది. నటి శోభితా ధూళిపాళ గర్భవతి అయ్యిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. త్వరలో నాగచైతన్య తండ్రి కాబోతున్నాడనే సమాచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఈ శుభవార్తను చైతూ – శోభితా దంపతులు త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అక్కినేని కుటుంబం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ శుభవార్త వెనుక మరో ఆసక్తికరమైన సినీ నేపథ్యం ఉంది. నాగచైతన్య మాజీ భార్య సమంత కూడా ఇటీవల రెండో వివాహం చేసుకున్నారు.
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత, సమంత ఒంటరిగా, మానసిక వేదనతో జీవించారు. అనారోగ్యానికి కూడా గురై, చివరకు వర్కౌట్‌లు, సినిమాలతో తిరిగి కోలుకున్నారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న దర్శకుడు రాజ్ నిడిమోరును సమంత ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నారు. రాజ్ నిడిమోరుకు కూడా ఇది రెండో పెళ్లే. సమంత రెండో పెళ్లి చేసుకోవడం నాగ చైతన్యకి కొంత షాక్ కలిగించిందని సినీ వర్గాల్లో టాక్.
ఈ నేపథ్యంలోనే సమంతకు షాక్ ఇచ్చేలా, లేదా కౌంటర్ ఇచ్చేలా నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడని అంటున్నారు. శోభితా గర్భవతి అయిన విషయాన్ని చైతూ త్వరలో సోషల్ మీడియా ద్వారా ప్రకటించి సమంతకు షాక్ ఇవ్వనున్నాడని చెబుతున్నారు.
ఈ వార్తల్లోని నిజానిజాలు ఇంకా అధికారికంగా తెలియకపోయినా, అక్కినేని అభిమానులు మాత్రం తమ ఆరాధ్య హీరో నాగచైతన్య తండ్రి కాబోతున్నాడనే వార్త విని సంతోషంగా ఉన్నారు. త్వరలోనే ఈ జంట నుంచి శుభవార్త కోసం సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.