- వినోదం.. కేవలం మీకోసమే! వేదిక మరియు సమయం..
- రిజిస్ట్రేషన్ మరియు ఫీజు వివరాలు.. ఆస్ట్రేలియాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణ..
Australia Womens day Celebrations: ఆస్ట్రేలియాలోని తెలుగు సంఘం 'తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇంక్', 'తెలుగు లేడీస్ క్లబ్' సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మార్చి 8వ తేదీన మెల్బోర్న్ లోని వాంటిర్నాలో ఈ వేడుకలు జరగనున్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో వినోదానికి పెద్ద పీట వేశారు. లైవ్ మ్యూజిక్, డీజే, డాన్స్, ఆసక్తికరమైన ఆటలతో పాటు మరెన్నో సర్ప్రైజ్ ఈవెంట్స్ ఉంటాయి.
భోజన వసతి: ప్రవేశ రుసుములోనే రుచికరమైన డిన్నర్, డ్రింక్స్ కూడా కలిపి ఉంటాయి.
వేదిక, సమయం:
తేదీ: మార్చి 8, 2026 (ఆదివారం)
సమయం: సాయంత్రం 6 గంటలకు ప్రారంభం.
వేదిక: 'తావా-ది ఇండియన్ గ్రిడిల్ రెస్టారెంట్, 137 మౌంటైన్ హైవే, వాంటిర్నా (VIC 3152).
ప్రవేశ రుసుము, రిజిస్ట్రేషన్:
ఈ వేడుకలో పాల్గొనాలనుకునే వారు ఒక్కొక్కరికి $30 ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు సాహిత్య (Sahitya) పేరిట ఉన్న 0470298522 నంబర్ కు PayID ద్వారా నగదు చెల్లించి సీటు రిజర్వ్ చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు మహిళలందరూ ఈ వేడుకలో పాల్గొని ఒక ఆహ్లాదకరమైన సాయంత్రం గడపాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.