- బహ్రెయిన్, సౌదీ నుంచి ప్రత్యేక విమానాలు: కొచ్చి విమానాశ్రయానికి క్యూ కట్టిన ప్రవాసులు.!
- దోహా నుంచి ఢిల్లీ దాకా.. ఆగని విమానాలు: ప్రతిరోజూ 850 మందికి పైగా స్వదేశానికి చేరిక..
Rammohan Naidu Meeting About Gulf Indians: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న భారతీయులను, ముఖ్యంగా మన తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తుండటం ప్రవాసుల్లో కొండంత ధైర్యాన్ని నింపుతోంది. గల్ఫ్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి మంత్రి రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ, డీజీసీఏ (DGCA) అధికారులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు.
కీలక సమీక్ష: గత పది రోజులుగా ఆయన ప్రతిరోజూ అధికారులతో మాట్లాడుతుూ, తరలింపులో ఎదురవుతున్న అడ్డంకులను తొలగిస్తున్నారు.
సమన్వయం: విదేశాంగ శాఖతో కలిసి స్థానిక ఎంబసీలు, విమాన సిబ్బందితో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఒక్కో ప్రయాణికుడిని సురక్షితంగా భారత్‌కు చేరుస్తున్నారు.
గత నెల 28 నుంచి నేటి వరకు జరిగిన తరలింపు ప్రక్రియపై అధికారులు మంత్రికి పూర్తి వివరాలను అందించారు.
దోహా నుంచి భారీగా: దోహా (ఖతార్) నుంచి ప్రతిరోజూ సుమారు 850 మందిని భారత్‌కు తరలిస్తున్నారు.
సౌదీ & బహ్రెయిన్: సౌదీ అరేబియా నుంచి కొచ్చికి నిత్యం 166 మంది వస్తున్నారు. అలాగే ఈరోజు బహ్రెయిన్ నుంచి కూడా ఒక ప్రత్యేక విమానం కొచ్చికి చేరుకోనుంది.
భారీ విజయం: ఇప్పటివరకు దాదాపు లక్ష మంది భారతీయులను గల్ఫ్ దేశాల నుంచి సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇది ఒక అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్‌గా నిలిచింది.
తరలింపు ప్రక్రియలో ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు అధికారులు ఈ నెల 16వ తేదీ వరకు ఒక స్పష్టమైన షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ప్రధాన నగరాలకు: దోహా, దమ్మమ్ ప్రాంతాల నుంచి ఢిల్లీ, ముంబై, కొచ్చి నగరాలకు విమానాలు నడుస్తాయి.
సహకారం: మన దేశీయ విమానయాన సంస్థలతో పాటు గల్ఫ్ ఎయిర్ కూడా ఈ ఆపరేషన్‌లో పూర్తిస్థాయిలో సహకరిస్తోందని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు కేవలం విమానం ఎక్కించడమే కాకుండా, ఇతర సాంకేతిక ఇబ్బందులు రాకుండా చూడాలని రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు.
వీసా చిక్కులు: యుద్ధం లేదా అత్యవసర పరిస్థితుల్లో వీసా గడువు ముగిసినా లేదా ఇతర పేపర్ వర్క్ సమస్యలు తలెత్తినా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా విదేశాంగ శాఖతో చర్చించాలని కోరారు.
ఎయిర్ ట్రాఫిక్: విమానాలు ల్యాండ్ అయ్యే సమయంలో ఎయిర్ ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలని, విమానాశ్రయాల్లో ల్యాండింగ్ అనుమతులు వేగంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గల్ఫ్ లో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఆందోళన చెందవద్దని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.
భద్రతే ప్రాధాన్యం: విమాన మార్గాలను యుద్ధ ప్రాంతాలకు దూరంగా మళ్లించి ప్రయాణికులను తీసుకువస్తున్నారు.
హెల్ప్ లైన్: ఎంబసీలు మరియు విమానయాన శాఖ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని సూచించారు.