LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Business

Petrol Price India: పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం కీలక ప్రకటన.. వాహనదారులకు భారీ ఊరట!

Petrol Price India: మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్నా, భారత దేశంలో పెట్రోల్, డీజిల్ ఎల్‌పీజీ ధరలను పెంచే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

AndhraPravasi News Desk 2 min read
Petrol Price India: పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం కీలక ప్రకటన.. వాహనదారులకు భారీ ఊరట!

గ్యాస్ సిలిండర్ల కొరత లేదు.. అక్రమ నిల్వలకు చెక్

ఇతర దేశాల నుంచి భారీగా ఇంధన దిగుమతులు

సామాన్యుడిపై భారం పడకుండా మాస్టర్ ప్లాన్

Petrol Price India: మధ్యప్రాచ్యంలో యుద్ధం జరుగుతున్నా, అక్కడ ఉద్రిక్తతలు పెరుగుతున్నా సరే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న మాట నిజమే కానీ, మన దగ్గర మాత్రం సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు భారీగా తగ్గిపోయినప్పటికీ, భారతదేశం తన సరఫరా వ్యవస్థను చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తోంది. కాబట్టి ప్రస్తుతానికి రేట్లు పెంచే ఆలోచన లేదని, ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా  ఇస్తుంది.

కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా వంట గ్యాస్ (LPG) విషయంలో కూడా ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త చెప్పింది. రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్ల కొరత రాకుండా ఉండేందుకు ఇతర దేశాల నుండి దిగుమతులను పెంచుతున్నారు. ప్రస్తుతం మనకు అమెరికా నుండి కొంత గ్యాస్ వస్తుండగా, త్వరలోనే కెనడా, ఆస్ట్రేలియా  నార్వే వంటి దేశాల నుండి కూడా సరఫరా మొదలవుతుంది. సిలిండర్ డెలివరీ సమయాన్ని 21 రోజుల నుండి 25 రోజులకు పెంచడం వెనుక అసలు ఉద్దేశ్యం గ్యాస్‌ను అక్రమంగా నిల్వ చేసే వారిని అరికట్టడమే తప్ప, సరఫరా తగ్గించడం కాదని అధికారులు వివరించారు.

ఇక విమాన ఇంధనం (ATF) గురించి చూస్తే, మన దేశంలో దానికి సంబంధించిన స్టాక్ కూడా చాలా ఎక్కువగా  ఉందని నిజానికి భారత్ విమాన ఇంధనాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది కాబట్టి, ఆ రంగంలో కూడా ధరలు పెరిగే ఛాన్స్ తక్కువగానే కనిపిస్తోంది. పారిశ్రామిక అవసరాలకు వాడే గ్యాస్ ధరల్లో కూడా ఎటువంటి మార్పులు చేయడం లేదు. దీనివల్ల సాధారణ వినియోగదారులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 130 డాలర్ల వరకు వెళ్లినా సరే, మన దేశంలో ధరలు పెంచకుండా ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారు.

సామాన్య ప్రజలపై భారం పడకుండా చూడటమే లక్ష్యంగా  మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాలు తీసుకుంది. ముడి చమురు ధరలు పెరిగినప్పుడు సాధారణంగా పన్నులు తగ్గిస్తారని అందరూ అనుకుంటారు, కానీ ప్రస్తుతం పన్నుల విషయంలో ఎలాంటి మార్పులు చేయడం లేదు. ఉన్న సుంకాలను తగ్గించే ఆలోచన లేదని, అలాగని కొత్తగా పెంచే ఉద్దేశ్యం కూడా లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రపంచ దేశాల మధ్య పరిస్థితులు ఎలా మారినా సరే, దేశీయ మార్కెట్‌లో ఇంధన భద్రతకు ఎటువంటి ఢోకా లేదని తాజా నివేదికల ద్వారా స్పష్టమవుతోంది.

యుద్ధం వల్ల చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం వద్ద ఉన్న పక్కా ప్లానింగ్ వల్ల ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఒకవేళ అంతర్జాతీయంగా పరిస్థితులు ఇంకా దారుణంగా మారితే, అప్పుడు మాత్రమే మళ్ళీ సమీక్ష జరుపుతామని అధికారులు అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం వాహనదారులు, గృహిణులు ధరల పెరుగుదల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటనిచ్చే  విషయంగా చెప్పుకోవచ్చు.

Be the first to react

More Coverage

India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!

India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!

India: భారతదేశంలోనే అతిపెద్ద గ్రౌండ్ హ్యాండ్లింగ్ (విమానాశ్రయ సేవల) సంస్థగా పేరొందిన టర్కీకి చెందిన…

Upasana: అపోలో గ్రూప్‌లో కీలక మార్పు.. కొత్త డిజిటల్ సంస్థకు ఛైర్‌పర్సన్‌గా.. మెగా కోడలు ఉపాసన తల్లికి..

Upasana: అపోలో గ్రూప్‌లో కీలక మార్పు.. కొత్త డిజిటల్ సంస్థకు ఛైర్‌పర్సన్‌గా.. మెగా కోడలు ఉపాసన తల్లికి..

Upasana: దేశంలోని అతిపెద్ద హెల్త్‌కేర్ సంస్థ అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ తన వ్యాపార పునర్‌వ్యవస్థ…

Indian Rupee: అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌పై భారీగా బలపడిన రూపాయి! ఏకంగా 58 పైసలు..

Indian Rupee: అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌పై భారీగా బలపడిన రూపాయి! ఏకంగా 58 పైసలు..

Indian Rupee: అంతర్జాతీయంగా చోటుచేసుకున్న కీలక పరిణామాలతో నేడు ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌తో…