ఎలక్ట్రిక్ వాహనాల (EV) విభాగంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు (E-Scooters) అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సెగ్మెంట్‌గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా సురక్షితంగా, సులభంగా నడపడానికి వీలుగా ఉండే కాంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మహిళా రైడర్‌ల మధ్య ప్రియారిటీ పెరుగుతోంది.
స్టైలిష్‌గా, బరువు తక్కువగా, సులభంగా హ్యాండిల్ చేయగలిగేలా, మరియు తక్కువ బడ్జెట్‌లో దొరికే ఈ స్కూటర్లు అర్బన్, సెమీ-అర్బన్ నగరాలలో రోజువారీ ప్రయాణాలకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. రిమూవబుల్ బ్యాటరీ, కీ-లెస్ ఎంట్రీ, యాంటీ-థెఫ్ట్ లాక్ వంటి ఫీచర్లు ఉండడం వలన వీటిని ఉపయోగించడం చాలా సౌకర్యంగా ఉంటుంది.
అతి తక్కువ ధరలో లభించే ప్రముఖ మోడళ్లలో జీలియో లిటిల్ గ్రేసీ ఒకటి. ఇది కేవలం 80 కిలోల బరువుతో, ట్రాఫిక్‌లో మహిళలు సులభంగా నడపడానికి వీలుగా ఉంటుంది. ఈ స్కూటర్ 1.5 యూనిట్ల విద్యుత్‌తో 60 నుంచి 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
ఇందులో సెంటర్ లాక్, యాంటీ-థెఫ్ట్ అలారం, యూఎస్‌బీ ఛార్జింగ్ మరియు లైసెన్స్ అవసరం లేని డ్రైవ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర ₹55,000 నుంచి ₹60,000 వరకు ఉంటుంది. రోజువారీ సిటీ రైడ్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ ఈవీ, సులభమైన ఆపరేషన్‌కు పేరుగాంచింది.
దీని 1.25 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఒకే ఛార్జ్‌పై 60 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. కేవలం 740 mm సీటు ఎత్తు ఉండటం వలన మహిళా రైడర్‌లు దీనిని సులభంగా ఆపరేట్ చేయగలరు. దీని ఎక్స్-షోరూమ్ ధర ₹69,093.
ఆకర్షణీయమైన లుక్, బడ్జెట్-ఫ్రెండ్లీ ధరలతో సిటీ రైడ్‌లకు అనుకూలం. దీని బరువు కేవలం 82 కిలోలు. ఏఆర్‌ఏఐ (ARAI) క్లెయిమ్ చేసిన రేంజ్ 121 కిలోమీటర్లు, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
ఇందులో 'లింప్ హోమ్' (Limp Home) అనే ప్రత్యేక ఫీచర్ ఉంది, దీని ద్వారా బ్యాటరీ చాలా తక్కువగా ఉన్నప్పుడు కూడా కొద్ది దూరం ప్రయాణించవచ్చు. దీని ధర ₹67,999 నుంచి ₹94,900 వరకు ఉంది.
నమ్మకమైన మరియు సౌకర్యవంతమైన కాంపాక్ట్ ఈవీగా హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా గుర్తింపు పొందింది. దీని బరువు 72.5-83 కిలోలు. ఇది ఫుల్ ఛార్జ్‌పై దాదాపు 89 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. పోర్టబుల్ బ్యాటరీ ఉండటం వలన ఇంట్లో కూడా సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
ధర: ఇది ₹85,000 నుంచి ₹90,000 ప్రైస్ రేంజ్‌లో లభిస్తుంది. రోజువారీ నగర ప్రయాణాల కోసం రూపొందించబడిన స్టైలిష్ మరియు పర్యావరణ అనుకూలమైన స్కూటర్.
దీని బరువు కేవలం 82 కిలోగ్రాములు. 2 kW LiPo బ్యాటరీ ద్వారా శక్తిని పొందుతుంది. తయారీదారులు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. స్మార్ట్ డిజిటల్ డాష్‌బోర్డ్ మరియు మంచి బూట్ స్పేస్ దీనికి అదనపు ఆకర్షణలు.
యాంటీ-థెఫ్ట్ లాక్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, యాంటీ-స్కిడ్ టైర్లు వంటి ఫీచర్లు భద్రతను అందిస్తాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర ₹97,256.