⚡ BREAKING

Nara Lokesh: నరసరావుపేటలో నారా లోకేష్‌కు ఘన స్వాగతం.. పసుపుమయంగా మారిన ప్రధాన రహదారి!

Nara Lokesh: మంత్రి నారా లోకేష్‌కు నరసరావుపేటలో టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో పట్టణంలోని ప్రధాన రహదారులు సందడిగా మారాయి. ఎస్‌ఆర్‌కే సెంటర్‌ వద్ద డప్పులు, డీజేలు, నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు.

Nara Lokesh
Nara Lokesh

నరసరావుపేటలో లోకేష్‌కు ఘన స్వాగతం.. భారీగా తరలివచ్చిన టీడీపీ, జనసేన శ్రేణులు..

యువనేతకు అడుగడుగునా అభిమానుల స్వాగతం.. గజమాలలతో లోకేష్‌కు సత్కారం..

నరసరావుపేట: మంత్రి నారా లోకేష్‌కు నరసరావుపేటలో టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో పట్టణంలోని ప్రధాన రహదారులు సందడిగా మారాయి. ఎస్‌ఆర్‌కే సెంటర్‌ వద్ద డప్పులు, డీజేలు, నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు.

ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికారు. యువనేతకు అడుగడుగునా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. గజమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారీ ఊరేగింపుగా కార్యకర్తలు లోకేష్‌ను అనుసరించారు.

నాయకులు, కార్యకర్తల భారీ సందడి
లోకేష్‌కు స్వాగతం పలికేందుకు నరసరావుపేటతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, భాష్యం రామకృష్ణ, నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జాన్ సైదా మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికారు.

అలాగే ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్, దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి, గుంటూరు మేయర్ కోవెలమూడి నాని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీడీపీ నాయకులు నల్లపాటి రామచంద్ర ప్రసాద్, మన్నవ మోహన కృష్ణ, గోనుగుంట్ల కోటేశ్వరరావు, కనుమూరి బాజి చౌదరి, కనపర్తి శ్రీనివాసరావు, మానుకొండ శివప్రసాద్ తదితరులు కూడా మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికారు.

పసుపుమయంగా మారిన నరసరావుపేట
కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో నరసరావుపేట ప్రధాన రహదారి పసుపుమయంగా కనిపించింది. డప్పుల మోత, డీజే శబ్దాలు, కార్యకర్తల నినాదాలతో ప్రాంతం సందడిగా మారింది. గజమాలలతో లోకేష్‌కు స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి వెంట భారీగా ఊరేగింపుగా సాగుతూ సందడి చేశారు.

జేఎన్‌టీయూ క్యాంపస్‌లో హాస్టల్ భవనాల ప్రారంభం
నరసరావుపేట పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ మరికాసేపట్లో జేఎన్‌టీయూ క్యాంపస్‌లో నూతన హాస్టల్ భవనాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి పర్యటన నేపథ్యంలో టీడీపీ, జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో నరసరావుపేటలో రాజకీయ సందడి నెలకొంది.

Tags

Be the first to react

Latest