AP పోలీస్ లో ఇంత భారీ జీత భత్యాలు ఉంటాయా? ఒకటే పరీక్ష.. గేమ్ చేంజెర్! వెంటనే సిద్ధం అవ్వండి!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (SLPRB) ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విభాగంలో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 43 పోస్టులను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. విభాగాల వారీగా సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజికల్) 10, సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్) 13, సైంటిఫిక్ అసిస్టెంట్ (బయాలజీ/సెరోలజీ) 20 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో (https://slprb.ap.gov.in) మాత్రమే స్వీకరించనున్నారు. దరఖాస్తుల సమర్పణకు సంబంధించిన ఖచ్చితమైన తేదీలను ప్రత్యేకంగా ప్రకటించనున్నట్లు బోర్డు తెలిపింది.
- ఏపీ పోలీస్ జాబ్స్: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వారికి 43 పోస్టులు
- AP SLPRB Jobs:ప్రిలిమినరీ ఎగ్జామ్ లేకుండానే పోలీస్ ఉద్యోగం.. పూర్తి వివరాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (SLPRB) ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విభాగంలో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 43 పోస్టులను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. విభాగాల వారీగా సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజికల్) 10, సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్) 13, సైంటిఫిక్ అసిస్టెంట్ (బయాలజీ/సెరోలజీ) 20 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో (https://slprb.ap.gov.in) మాత్రమే స్వీకరించనున్నారు. దరఖాస్తుల సమర్పణకు సంబంధించిన ఖచ్చితమైన తేదీలను ప్రత్యేకంగా ప్రకటించనున్నట్లు బోర్డు తెలిపింది.
విద్యార్హతలు
ఫిజికల్ పోస్టులకు ఫిజిక్స్‌లో ఎం.ఎస్సీ లేదా ఫోరెన్సిక్ సైన్స్‌లో ఫిజిక్స్ ప్రత్యేక సబ్జెక్టుగా ఉన్న అర్హత అవసరం. కెమికల్ పోస్టులకు కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీలో ఎం.ఎస్సీ, లేదా కెమిస్ట్రీ/టాక్సికాలజీ ప్రత్యేక సబ్జెక్టుతో ఫోరెన్సిక్ సైన్స్ అర్హత ఉండాలి. బయాలజీ/సెరోలజీ పోస్టులకు బయాలజీ, జువాలజీ, బోటనీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ లేదా బయాలజీ స్పెషలైజేషన్‌తో ఫోరెన్సిక్ సైన్స్‌లో ఎం.ఎస్సీ అర్హతగా నిర్ణయించారు.
పరీక్ష విధానం
సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమినరీ రాత పరీక్ష ఉండదు. ప్రధాన రాత పరీక్ష 120 మార్కులకు, ఆబ్జెక్టివ్ విధానంలో, రెండు గంటల వ్యవధితో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.
రాత పరీక్షలో అర్హత సాధించేందుకు ఓసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ/ఎస్టీలకు 30 శాతం కనీస మార్కులు అవసరం. అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.
దరఖాస్తు ఫీజు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 ఫీజు చెల్లించాలి. రాష్ట్రానికి నాన్-లోకల్ అభ్యర్థులకు ఫీజు రూ.600గా నిర్ణయించారు.
మహిళలకు 33⅓ శాతం రిజర్వేషన్
ఈ మూడు పోస్టులలో ప్రతి కేటగిరీలో 33⅓ శాతం పోస్టులను మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ కింద కేటాయించారు.
వేతనం
ఎంపికైన సైంటిఫిక్ అసిస్టెంట్లకు రూ.44,570 నుంచి రూ.1,27,480 వరకు పే స్కేల్ వర్తించనుంది.
అభ్యర్థులు దరఖాస్తు తేదీలు, ఇతర వివరాల కోసం ఏపీ SLPRB అధికారిక వెబ్‌సైట్‌ను (https://slprb.ap.gov.in)పరిశీలించాలని నోటిఫికేషన్ సూచించింది. ఒక అభ్యర్థి తన విద్యార్హతకు అనుగుణంగా 61,62 లేదా 63 కోడ్‌లలో ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పిస్తే అనర్హతకు గురయ్యే అవకాశం ఉంది.
Tags
Be the first to react