Flights for AP Students: విద్యార్థుల కలను నిజం చేసిన ఎమ్మెల్యే సౌమ్య.. సొంత ఖర్చులతో విమానయానం! Tamil Nadu Politics: తమిళనాట విజయ్‌కు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వని డీఎంకే మిత్రపక్షాలు! Kavitha Maji: బెంగాల్ బీజేపీలో కొత్త చరిత్ర.. ఇళ్లలో పనిచేసే మహిళకు పట్టం కట్టిన ఓటర్లు! Union Government: ఏపీలో పేదలకు తీపికబురు.. ఒక్కొక్కరి అకౌంట్‌లోకి రూ.2.39 లక్షలు! అర్హులు వీరే... Bullet Train: పట్టాలెక్కనున్న బుల్లెట్ రైళ్లు... 3 గంటల్లో హైదరాబాద్ టు బెంగళూరు! Promotions: సచివాలయ ఉద్యోగులకు హైకోర్టు తీపి కబురు: ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లపై కీలక ఉత్తర్వులు! Express Highway: అమరావతికి రాజమార్గం! బెంగళూరు, చెన్నై నగరాలకు చేరువగా... 92 కిమీ ఎక్స్‌ప్రెస్‌వేకు గ్రీన్ సిగ్నల్! Balakrishna: సినిమా గ్లామర్ కాదు.. ప్రజాబలం! బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. Vijay: చారిత్రక విజయం.. కరూర్ మృతులకు అంకితం.. టీవీకే పార్టీ సంచలన ప్రకటన.. Prajavedhika: మంగళగిరి ప్రజా గ్రీవెన్స్ లో పోటెత్తిన బాధితులు: వైసీపీ అరాచకాలపై వెల్లువెత్తిన అర్జీలు! Flights for AP Students: విద్యార్థుల కలను నిజం చేసిన ఎమ్మెల్యే సౌమ్య.. సొంత ఖర్చులతో విమానయానం! Tamil Nadu Politics: తమిళనాట విజయ్‌కు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వని డీఎంకే మిత్రపక్షాలు! Kavitha Maji: బెంగాల్ బీజేపీలో కొత్త చరిత్ర.. ఇళ్లలో పనిచేసే మహిళకు పట్టం కట్టిన ఓటర్లు! Union Government: ఏపీలో పేదలకు తీపికబురు.. ఒక్కొక్కరి అకౌంట్‌లోకి రూ.2.39 లక్షలు! అర్హులు వీరే... Bullet Train: పట్టాలెక్కనున్న బుల్లెట్ రైళ్లు... 3 గంటల్లో హైదరాబాద్ టు బెంగళూరు! Promotions: సచివాలయ ఉద్యోగులకు హైకోర్టు తీపి కబురు: ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లపై కీలక ఉత్తర్వులు! Express Highway: అమరావతికి రాజమార్గం! బెంగళూరు, చెన్నై నగరాలకు చేరువగా... 92 కిమీ ఎక్స్‌ప్రెస్‌వేకు గ్రీన్ సిగ్నల్! Balakrishna: సినిమా గ్లామర్ కాదు.. ప్రజాబలం! బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. Vijay: చారిత్రక విజయం.. కరూర్ మృతులకు అంకితం.. టీవీకే పార్టీ సంచలన ప్రకటన.. Prajavedhika: మంగళగిరి ప్రజా గ్రీవెన్స్ లో పోటెత్తిన బాధితులు: వైసీపీ అరాచకాలపై వెల్లువెత్తిన అర్జీలు!

Tamil Nadu Politics: తమిళనాట విజయ్‌కు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వని డీఎంకే మిత్రపక్షాలు!

Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటు మార్గంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Published : 2026-05-05 14:27:00
  • ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి 10 సీట్ల దూరంలో నిలిచిన పార్టీ..
     
  • మద్దతుపై స్పష్టత ఇవ్వని డీఎండీకే అధినేత్రి ప్రేమలత విజయకాంత్..

Tamil Nadu Politics: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద శక్తిగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తీవ్ర ప్రతిష్టంభన ఎదురవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌కు విజయ్ పార్టీ కేవలం పది స్థానాల దూరంలో నిలిచిపోయింది. ఈ కీలక తరుణంలో డీఎంకే కూటమిలోని మిత్రపక్షాలు విజయ్‌కు మద్దతిచ్చేందుకు ససేమిరా అంటుండటంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ఈ అంశంపై స్పందిస్తూ, ఎన్నికల తర్వాత పొత్తులు మార్చే ప్రసక్తే లేదని, డీఎంకే కూటమిలోని ఏ పార్టీ కూడా టీవీకేకు మద్దతు ఇచ్చే ఆలోచనలో లేదని స్పష్టం చేశారు.

ఇదే అభిప్రాయాన్ని విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) నేత థోల్ తిరుమావళవన్ కూడా వ్యక్తం చేస్తూ, తామంతా లౌకిక రాజకీయ మార్గంలో సుదీర్ఘ కాలంగా కలిసి ప్రయాణిస్తున్నామని, టీవీకేకు మద్దతు ఇచ్చే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి ఆలోచన చేయలేదని వివరించారు. మరోవైపు డీఎండీకే అధినేత్రి ప్రేమలత విజయకాంత్, విజయ్‌ను తమ ఇంటి బిడ్డగా అభివర్ణిస్తూ ఆయన గెలుపును అభినందించినప్పటికీ, రాజకీయ మద్దతుపై మాత్రం ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. డీఎంకే కూటమిలో ఉండి కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన డీఎండీకే, కూటమి నేత స్టాలిన్ ఓటమి పాలుకావడంతో ప్రస్తుతం ఆ కూటమిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు.

రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో విజయ్ తన తదుపరి వ్యూహాలపై దృష్టి సారించారు. చెన్నైలోని పనైయూర్ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మరియు పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి, మెజారిటీ నిరూపించుకోవడానికి గల అవకాశాలపై చర్చిస్తున్నారు. ఏ పార్టీ కూడా నేరుగా మద్దతు ప్రకటించని ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్ ఎలాంటి వినూత్న ఎత్తుగడలు వేస్తారనేది ఇప్పుడు తమిళనాట ఉత్కంఠ రేపుతోంది. ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ దూసుకొచ్చిన విజయ్, అధికార పీఠాన్ని దక్కించుకోవడంలో ఎదురవుతున్న ఈ అడ్డంకులను ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.

Spotlight

Read More →