Flights for AP Students: విద్యార్థుల కలను నిజం చేసిన ఎమ్మెల్యే సౌమ్య.. సొంత ఖర్చులతో విమానయానం! Tamil Nadu Politics: తమిళనాట విజయ్‌కు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వని డీఎంకే మిత్రపక్షాలు! Kavitha Maji: బెంగాల్ బీజేపీలో కొత్త చరిత్ర.. ఇళ్లలో పనిచేసే మహిళకు పట్టం కట్టిన ఓటర్లు! Union Government: ఏపీలో పేదలకు తీపికబురు.. ఒక్కొక్కరి అకౌంట్‌లోకి రూ.2.39 లక్షలు! అర్హులు వీరే... Bullet Train: పట్టాలెక్కనున్న బుల్లెట్ రైళ్లు... 3 గంటల్లో హైదరాబాద్ టు బెంగళూరు! Promotions: సచివాలయ ఉద్యోగులకు హైకోర్టు తీపి కబురు: ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లపై కీలక ఉత్తర్వులు! Express Highway: అమరావతికి రాజమార్గం! బెంగళూరు, చెన్నై నగరాలకు చేరువగా... 92 కిమీ ఎక్స్‌ప్రెస్‌వేకు గ్రీన్ సిగ్నల్! Balakrishna: సినిమా గ్లామర్ కాదు.. ప్రజాబలం! బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. Vijay: చారిత్రక విజయం.. కరూర్ మృతులకు అంకితం.. టీవీకే పార్టీ సంచలన ప్రకటన.. Prajavedhika: మంగళగిరి ప్రజా గ్రీవెన్స్ లో పోటెత్తిన బాధితులు: వైసీపీ అరాచకాలపై వెల్లువెత్తిన అర్జీలు! Flights for AP Students: విద్యార్థుల కలను నిజం చేసిన ఎమ్మెల్యే సౌమ్య.. సొంత ఖర్చులతో విమానయానం! Tamil Nadu Politics: తమిళనాట విజయ్‌కు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వని డీఎంకే మిత్రపక్షాలు! Kavitha Maji: బెంగాల్ బీజేపీలో కొత్త చరిత్ర.. ఇళ్లలో పనిచేసే మహిళకు పట్టం కట్టిన ఓటర్లు! Union Government: ఏపీలో పేదలకు తీపికబురు.. ఒక్కొక్కరి అకౌంట్‌లోకి రూ.2.39 లక్షలు! అర్హులు వీరే... Bullet Train: పట్టాలెక్కనున్న బుల్లెట్ రైళ్లు... 3 గంటల్లో హైదరాబాద్ టు బెంగళూరు! Promotions: సచివాలయ ఉద్యోగులకు హైకోర్టు తీపి కబురు: ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లపై కీలక ఉత్తర్వులు! Express Highway: అమరావతికి రాజమార్గం! బెంగళూరు, చెన్నై నగరాలకు చేరువగా... 92 కిమీ ఎక్స్‌ప్రెస్‌వేకు గ్రీన్ సిగ్నల్! Balakrishna: సినిమా గ్లామర్ కాదు.. ప్రజాబలం! బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. Vijay: చారిత్రక విజయం.. కరూర్ మృతులకు అంకితం.. టీవీకే పార్టీ సంచలన ప్రకటన.. Prajavedhika: మంగళగిరి ప్రజా గ్రీవెన్స్ లో పోటెత్తిన బాధితులు: వైసీపీ అరాచకాలపై వెల్లువెత్తిన అర్జీలు!

Vangalapudi Anitha: హెల్మెట్‌తోనే భద్రత.. అవగాహన కోసం హోం మంత్రి అనిత బైక్ ర్యాలీ!

Vangalapudi Anitha: రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

Published : 2026-05-05 14:22:00

హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు కవచం..

బైక్ ర్యాలీలో పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత..

నక్కపల్లి: రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

మంగళవారం ఉదయం ఎస్.రాయవరం మండలం తిమ్మాపురం ఫ్లైఓవర్ (అడ్డురోడ్డు) వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ, నక్కపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు సాగింది. “సురక్షిత రోడ్లు - సురక్షిత జీవితం” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి స్వయంగా హెల్మెట్ ధరించి బైక్ నడిపారు. సుమారు 500 మంది యువత, పోలీసు సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొని సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా వాహనదారులకు మంత్రి స్వయంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, ప్రాణం విలువైనదని, దాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి బైక్ కొనుగోలు చేసే వారు, ప్రాణాలను రక్షించే హెల్మెట్ కోసం మాత్రం వెనుకడుగు వేయడం సరికాదని పేర్కొన్నారు.

“మీరు లేకుండా మీ కుటుంబం కష్టాల్లో పడకూడదంటే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి” అని మంత్రి స్పష్టం చేశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఎవరైనా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ నాయకులు కూడా నిబంధనలు పాటించాల్సిందేనని, హెల్మెట్ లేకుండా కనిపిస్తే వారికి రెట్టింపు జరిమానా విధించాలని పోలీసులకు ఆదేశించారు.

ఇటీవల ఈ నియోజకవర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం జరగడం బాధాకరమని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తేనే ఇలాంటి ఘటనలను తగ్గించవచ్చని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు, పాయకరావుపేట ఇన్స్పెక్టర్ శంకర్రావు, నక్కపల్లి సీఐ రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్ మురళి, స్థానిక ఎస్సైలు, పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా “హెల్మెట్ ధరిద్దాం - ప్రాణాలు కాపాడుకుందాం” అనే సందేశంతో ర్యాలీ ముగిసింది.

Spotlight

Read More →