Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

AP Government: మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం భారీ భరోసా..! బీమా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు!

 ఏపీ ప్రభుత్వం మత్స్యకారుల భద్రత, వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కీలకమైన నిర్ణయం తీసుకుంది. చేపల వేట సమయంలో జరిగే ప్రమాదాల్లో మత్స్యకారులు

2026-01-19 09:15:00
Train Accident: ఘోర రైలు ప్రమాదం... పట్టాలు తప్పిన రైలును ఢీకొన్న మరో ట్రెయిన్!

ఏపీ ప్రభుత్వం మత్స్యకారుల భద్రత, వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కీలకమైన నిర్ణయం తీసుకుంది. చేపల వేట సమయంలో జరిగే ప్రమాదాల్లో మత్స్యకారులు ప్రాణాలు కోల్పోతే, వారి కుటుంబాలకు అందించే బీమా పరిహారాన్ని భారీగా పెంచింది. ఇప్పటివరకు రూ.2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమా మొత్తాన్ని ఏకంగా రూ.10 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సాయం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) పథకం కింద అందించనుంది. సముద్రంలోకి వెళ్లి ప్రాణాలకే తెగించి జీవనం సాగించే మత్స్యకార కుటుంబాలకు ఇది ఒక పెద్ద భరోసాగా నిలవనుంది.

iPhone 16 Plus: ఐఫోన్‌ రిపబ్లిక్ డే సేల్స్ బంపర్ ఆఫర్.. విజయ్ సేల్స్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్లస్ ధర..!

ప్రధానంగా చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు మాత్రమే రూ.10 లక్షల బీమా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వేటతో సంబంధం లేని సాధారణ మరణాలు లేదా ఇతర ప్రమాదాల్లో మృతి చెందిన మత్స్యకారులకు మాత్రం కార్మిక శాఖ ద్వారా రూ.2 లక్షల పరిహారం అందుతుంది. ఈ విధంగా ప్రమాద స్వభావాన్ని బట్టి పరిహారం నిర్ణయించడంతో ప్రభుత్వ నిధులు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సముద్రంలో వేట సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను పరిగణలోకి తీసుకుని ఈ పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Praja Vedika: నేడు (19/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఈ బీమా సాయం పొందాలంటే మత్స్యకారులు కొన్ని అర్హత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మత్స్యకార సహకార సంఘంలో సభ్యులై ఉండటం, చెల్లుబాటు అయ్యే చేపల వేట లైసెన్స్ కలిగి ఉండటం ప్రధాన అర్హతలు. అదేవిధంగా సముద్రంలోకి వెళ్లే బోట్లలో పనిచేసే సిబ్బంది తమ వివరాలను మత్స్యశాఖ అధికారుల వద్ద ముందుగానే నమోదు చేసుకోవాలి. ఈ విధానం ద్వారా నకిలీ క్లెయిమ్‌లను అడ్డుకోవడంతో పాటు, నిజమైన మత్స్యకార కుటుంబాలకు సాయం అందేలా ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తోంది.

AP Farmers: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. ఏకంగా 90% రాయితీ! 10% చెల్లిస్తే చాలు..!

బీమా పరిహారం పొందేందుకు ఆధార్ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రం, పంచనామా రిపోర్ట్, రేషన్ కార్డు, మత్స్యకార సహకార సంఘ సభ్యత్వ ధ్రువీకరణ పత్రం, సంఘం తీర్మానం కాపీ వంటి పత్రాలను జిల్లా మత్స్యశాఖ కార్యాలయాల్లో లేదా రైతు సేవా కేంద్రాల్లో సమర్పించాలి. ఇప్పటికే వేట నిషేధ కాలంలో ఆర్థిక సాయం, బోట్లకు రాయితీలు, వలలు, ఇంజిన్ల పంపిణీ వంటి పథకాలతో మత్స్యకారులను ఆదుకుంటున్న ప్రభుత్వం, ఇప్పుడు బీమా మొత్తాన్ని కూడా గణనీయంగా పెంచడం ద్వారా మరింత భరోసా కల్పిస్తోంది. అర్హులైన ప్రతి మత్స్యకారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అమెరికా 'ఆర్-1' వీసాలో భారీ మార్పు.. మత కార్యకర్తలకు బంపర్ ఆఫర్.. ఇక ఆ నిబంధన లేదు!
Mega Powerstar: సైలెంట్‌గా పనిచేస్తున్నా అంటూ.. షర్ట్‌లెస్ ఫోటో షేర్ చేసిన మెగా పవర్‌స్టార్!
Credit card: క్రెడిట్ కార్డ్ భవిష్యత్తు SMA చేతుల్లోనే..! పూర్తి వివరాలు మీ కోసం!
Silver: బంగారానికే కాదు వెండికీ పండుగే..! రూ.3 లక్షల దిశగా దూసుకెళ్తున్న తెల్లని లోహం!
Nursing candidates: నర్సింగ్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. TGలో రెండో మెరిట్ లిస్ట్ రిలీజ్!
AJAY Scheme: డ్వాక్రా మహిళలకు 3 లక్షల వడ్డీ లేని రుణాలు.. ఆ జిల్లాకే అత్యధిక ప్రాధాన్యత!!

Spotlight

Read More →