LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.!

Chandrababu: పెట్టుబడుల వేటలో ఏపీ... కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం!

Chandrababu: అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పెట్టుబడులు పెంచడంపై సమీక్షించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఎకనామిక్ రీజియన్లుగా ప్రకటించి అధికారులను నియమించారు.

Published : 2026-03-12 11:40:00

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: జిల్లాల మధ్య పోటీ పెట్టనున్న ముఖ్యమంత్రి.

విశాఖ, అమరావతి, తిరుపతి ఇక ఆర్థిక హబ్‌లు.. ప్రత్యేక అధికారుల నియామకం…

పరిశ్రమలు వస్తేనే ఉపాధి.. కలెక్టర్లు ప్రోయాక్టివ్ గా ఉండాలి: చంద్రబాబు…

Chandrababu: అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మరియు పెట్టుబడులపై కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడి ప్రతిపాదనలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, అవి త్వరితగతిన కార్యరూపం దాల్చేలా (Grounding Projects) కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఏ జిల్లాల్లో అయితే పరిశ్రమలు వేగంగా స్థాపించబడతాయో, ఆ జిల్లాల కలెక్టర్ల పనితీరును మెచ్చుకుంటూ వారికి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' కింద ర్యాంకులు ఇస్తామని, అధికారుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని ఆయన సూచించారు.

పెట్టుబడులు రాబట్టడంలో కలెక్టర్లు ప్రోయాక్టివ్ గా వ్యవహరించాలని, అనుమతులు ఇవ్వడంలో జాప్యం జరగకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమలకు అవసరమైన భూ కేటాయింపులు, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని చెప్పారు. రాష్ట్రంలో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ప్రధాన ఆర్థిక మండలాలుగా (Economic Regions) తీర్చిదిద్దుతున్నామని, వీటికి ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక బాధ్యులుగా నియమించినట్లు ప్రకటించారు. పరిశ్రమల వల్ల స్థానిక యువతకు ఉపాధి పెరగడమే కాకుండా, ప్రజల తలసరి ఆదాయం కూడా పెరుగుతుందని ఆయన వివరించారు.

గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని, ఉన్న కంపెనీలను కూడా పారిపోయేలా చేశారని చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. 2014-19 మధ్య పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూములను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో బెంగళూరుకు పోటీగా హైదరాబాద్‌ను ఎలాగైతే అభివృద్ధి చేశామో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే తరహా అనుకూల వాతావరణాన్ని (Eco System) నిర్మించడమే తన లక్ష్యమని ఆయన కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంటుందని, కలెక్టర్లు ఆయా జిల్లాల అనుకూలతలను గుర్తించి పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి కోరారు. కొన్ని జిల్లాల్లో భారీ పరిశ్రమలు రాకపోతే, అక్కడ పర్యాటక రంగం (Tourism) లేదా ఐటీ, ఎంఎస్ఎంఈలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ గా మారుతోందని, అలాగే కడప జిల్లాలోని కొప్పర్తి కూడా అతిపెద్ద పారిశ్రామిక క్లస్టర్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి జిల్లాలో ఇన్వెస్టర్ మీటింగ్‌లు ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించాలని చెప్పారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రులు, కలెక్టర్లు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏ రంగంలో అభివృద్ధి సాధ్యమో ఆ రంగాన్ని కలెక్టర్లు ప్రమోట్ చేయాలని, అప్పుడే రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. గతంలో తాము చేసిన కృషితోనే హైదరాబాద్‌కు ఐఎస్బీ వంటి అంతర్జాతీయ సంస్థలు వచ్చాయని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఏపీని కూడా అంతర్జాతీయ స్థాయిలో నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. అధికారులందరూ ప్రణాళికాబద్ధంగా పనిచేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సదస్సులో దిశానిర్దేశం చేశారు.

Spotlight

Read More →