తేదీ 19-01-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 19 జనవరి 2026 (సోమవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ ఎన్.ఎమ్.డి. ఫరూక్ గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ బీద రవి చంద్ర గారు (ఎంఎల్సీ)
రాయలసీమలో ఉద్యాన పంటలకు ప్రభుత్వం ఎందుకు పెద్దపీట వేస్తోంది..?
రాయలసీమ ప్రాంతాన్ని వ్యవసాయంగా బలోపేతం చేసి రైతుల ఆదాయం పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉద్యాన పంటలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు. కరువులు, నీటి కొరత కారణంగా రాయలసీమ రైతులు సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం భావిస్తుంది. ఈ పరిస్థితుల్లో సంప్రదాయ పంటలకంటే తక్కువ నీటితో ఎక్కువ లాభం ఇచ్చే ఉద్యాన పంటలు రైతులకు భరోసా కల్పిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే ఈ ఏడాది రెండు లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.