Scam: ప్రధాని మోదీ పేరుతో ఈ-మెయిల్ మోసం…! దిల్లీ వాసిపై సీబీఐ కేసు! TTD Updates: తిరుమలలో మూడ్రోజుల్లో 1.77 లక్షల మందికి.. జనవరి 8 వరకు! BSNL కస్టమర్లకు బిగ్ గుడ్‌న్యూస్…! దేశవ్యాప్తంగా VoWiFi సేవలు ప్రారంభం! Fastag: వాహనదారులకు గుడ్‌న్యూస్…! ఫాస్టాగ్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పు! యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!! Bullet Train: తొలి బుల్లెట్ ట్రైన్ ముహూర్తం ఫిక్స్! పూర్త్ వివరాలు.... Delivery boy: రూ.501 టిప్… కానీ విలువ కోట్లలో! డెలివరీ బాయ్ కన్నీళ్లు పెట్టించిన న్యూ ఇయర్ దయ! Registration: 22ఏ నిషిద్ధ జాబితాకు బ్రేక్‌…! రైతులు, భూ యజమానులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్! Fitness Tips: చలికాలంలో బరువు పెరుగుతోందా? ఈ చిన్న జాగ్రత్తలతో సమస్యకు చెక్!! GST: జీఎస్టీతో ఖజానాకు భారీ ఊపిరి…! డిసెంబరులో రికార్డు స్థాయి ఆదాయం! Scam: ప్రధాని మోదీ పేరుతో ఈ-మెయిల్ మోసం…! దిల్లీ వాసిపై సీబీఐ కేసు! TTD Updates: తిరుమలలో మూడ్రోజుల్లో 1.77 లక్షల మందికి.. జనవరి 8 వరకు! BSNL కస్టమర్లకు బిగ్ గుడ్‌న్యూస్…! దేశవ్యాప్తంగా VoWiFi సేవలు ప్రారంభం! Fastag: వాహనదారులకు గుడ్‌న్యూస్…! ఫాస్టాగ్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పు! యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!! Bullet Train: తొలి బుల్లెట్ ట్రైన్ ముహూర్తం ఫిక్స్! పూర్త్ వివరాలు.... Delivery boy: రూ.501 టిప్… కానీ విలువ కోట్లలో! డెలివరీ బాయ్ కన్నీళ్లు పెట్టించిన న్యూ ఇయర్ దయ! Registration: 22ఏ నిషిద్ధ జాబితాకు బ్రేక్‌…! రైతులు, భూ యజమానులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్! Fitness Tips: చలికాలంలో బరువు పెరుగుతోందా? ఈ చిన్న జాగ్రత్తలతో సమస్యకు చెక్!! GST: జీఎస్టీతో ఖజానాకు భారీ ఊపిరి…! డిసెంబరులో రికార్డు స్థాయి ఆదాయం!

Scam: ప్రధాని మోదీ పేరుతో ఈ-మెయిల్ మోసం…! దిల్లీ వాసిపై సీబీఐ కేసు!

2026-01-01 21:34:00
TTD Updates: తిరుమలలో మూడ్రోజుల్లో 1.77 లక్షల మందికి.. జనవరి 8 వరకు!

ప్రధాని నరేంద్ర మోదీ పేరును దుర్వినియోగం చేస్తూ ఈ-మెయిల్స్ పంపిన వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కేసు నమోదు చేసింది. తనకు ప్రధాని మోదీ ఆశీస్సులు ఉన్నాయని, స్వదేశీ యుద్ధ విమానాల ఇంజిన్ల తయారీలో కీలక పాత్ర పోషిస్తానని చెబుతూ పలు కీలక రక్షణ, పరిశోధన సంస్థలకు ఈ-మెయిల్స్ పంపిన దిల్లీ వాసిపై ఈ చర్యలు తీసుకుంది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. ప్రధాని పేరు, పదవిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం తీవ్రమైన అంశమని పీఎంఓ అధికారులు భావించడంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది.

BSNL కస్టమర్లకు బిగ్ గుడ్‌న్యూస్…! దేశవ్యాప్తంగా VoWiFi సేవలు ప్రారంభం!

సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, దిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతానికి చెందిన నిశిత్ కోహ్లీ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. 2024 అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య కాలంలో నిందితుడు డీఆర్‌డీవో, ఇస్రో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) వంటి అత్యంత కీలకమైన సంస్థలకు వరుసగా ఈ-మెయిల్స్ పంపినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాదు, అమెరికాలోని పెంటగాన్‌కు చెందిన ఓ నేవీ అధికారిక ఇ-మెయిల్ ఐడీకూ ఈ సందేశాలు పంపినట్లు అధికారులు గుర్తించారు. ఈ మెయిల్స్‌లో తన ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆశీర్వాదం ఉందని, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా తన అర్హతలను ధ్రువీకరించారని పేర్కొనడం గమనార్హం.

Fastag: వాహనదారులకు గుడ్‌న్యూస్…! ఫాస్టాగ్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పు!

ఈ మెయిల్స్‌పై అనుమానం వచ్చిన పీఎంఓ అధికారులు, ప్రధాని పేరును అనధికారికంగా ఉపయోగించి ప్రభుత్వ సంస్థలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని భావించారు. దీంతో వెంటనే సీబీఐకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సీబీఐ, భారతీయ న్యాయ సంహిత (BNS)తో పాటు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ముఖ్యంగా జాతీయ భద్రతకు సంబంధించిన రక్షణ సంస్థలకు సంబంధించిన అంశం కావడంతో దర్యాప్తును అత్యంత సీరియస్‌గా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!!

ప్రస్తుతం నిందితుడి అసలు ఉద్దేశం ఏమిటి, ఈ ఈ-మెయిల్స్ ద్వారా అతడు ఎలాంటి లాభాలు పొందాలని ప్రయత్నించాడన్న అంశాలపై సీబీఐ లోతైన విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి సమాచార లీక్ ప్రమాదం ఏర్పడిందా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాని పేరు, పీఎంఓ అధికారుల పేర్లను ఉపయోగించి ఈ తరహా మోసాలకు పాల్పడడం దేశ భద్రతపరంగా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు తెలిపాయి.

Bullet Train: తొలి బుల్లెట్ ట్రైన్ ముహూర్తం ఫిక్స్! పూర్త్ వివరాలు....
Delivery boy: రూ.501 టిప్… కానీ విలువ కోట్లలో! డెలివరీ బాయ్ కన్నీళ్లు పెట్టించిన న్యూ ఇయర్ దయ!
Registration: 22ఏ నిషిద్ధ జాబితాకు బ్రేక్‌…! రైతులు, భూ యజమానులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్!
Fitness Tips: చలికాలంలో బరువు పెరుగుతోందా? ఈ చిన్న జాగ్రత్తలతో సమస్యకు చెక్!!
GST: జీఎస్టీతో ఖజానాకు భారీ ఊపిరి…! డిసెంబరులో రికార్డు స్థాయి ఆదాయం!
Spirit Movie Update: న్యూ ఇయర్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్.. స్పిరిట్ ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్!!

Spotlight

Read More →