Europe: డెన్మార్క్ వీధుల్లో భారత జెండాల రెపరెపలు.. అమరావతి బిల్లు ఆమోదంతో యూరోప్‌లో సంబరాలు.. US Iran War: చర్చల కోసం పాకిస్థాన్ బయల్దేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. మాతో ఆటలాడకండి - ఇరాన్‌కు వార్నింగ్ Dhurandhar 2: బాలీవుడ్ సత్తా చాటిన ధురంధర్ 2: ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఆదిత్య ధర్ సీక్వెల్! కేవలం మూడు వారాల్లో.. Kanakaraju Movie: తమన్ మ్యూజిక్, మేర్లపాక కామెడీ.. ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ ప్రోమోతో అంచనాలు రెట్టింపు! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Europe: డెన్మార్క్ వీధుల్లో భారత జెండాల రెపరెపలు.. అమరావతి బిల్లు ఆమోదంతో యూరోప్‌లో సంబరాలు.. US Iran War: చర్చల కోసం పాకిస్థాన్ బయల్దేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. మాతో ఆటలాడకండి - ఇరాన్‌కు వార్నింగ్ Dhurandhar 2: బాలీవుడ్ సత్తా చాటిన ధురంధర్ 2: ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఆదిత్య ధర్ సీక్వెల్! కేవలం మూడు వారాల్లో.. Kanakaraju Movie: తమన్ మ్యూజిక్, మేర్లపాక కామెడీ.. ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ ప్రోమోతో అంచనాలు రెట్టింపు! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.!

AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి!

AP Revenue Department: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో గత 22 నెలల్లో వచ్చిన సమూల మార్పులు, రీసర్వే 2.0 లక్ష్యాలు కొత్త పట్టాదారు పాసుపుస్తకాల ప్రత్యేకతలపై ప్రత్యేక కథనం. భూ వివాదాల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు..

Published : 2026-04-10 18:41:00

AP Revenue Department:  ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా అస్తవ్యస్తంగా మారిన రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గత పాలకుల హయాంలో భూ వివాదాలు, రికార్డుల తారుమారుతో ప్రజలు అనుభవించిన మానసిక వేదనకు స్వస్తి పలుకుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రెవెన్యూ శాఖకు కొత్త కొత్త బలం' చేకూరుతుంది. ప్రజల ఆస్తులకు పూర్తి స్థాయి భద్రత కల్పించడమే లక్ష్యంగా, పాత చట్టాలకు మార్పులు చేస్తూ విప్లవాత్మక నిర్ణయాలు అమలవుతున్నాయి. ముఖ్యంగా వివాదాస్పద 'ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్' రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది.

గత ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే విధానం అనేక తప్పులతో కూడి ఉండటంతో, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం రీ-సర్వే 2.0' కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16,816 గ్రామాల్లో సర్వే ప్రక్రియ వేగంగా సాగుతోంది. 2027 మార్చి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి, ప్రతి రైతుకూ స్పష్టమైన హక్కులను కల్పించాలని ప్రభుత్వం గడువు పెట్టుకుంది. సర్వే రాళ్లపై, పాసు పుస్తకాలపై గత పాలకుల బొమ్మలను తొలగించి, అధికారిక రాజముద్రతో కూడిన కొత్త పుస్తకాలను పంపిణీ చేయడం విశేషం.

ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు 'వాట్సాప్ గవర్నెన్స్' (మన మిత్ర) వంటి ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టారు. దీనివల్ల కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే శ్రమ తగ్గింది. అవినీతికి ఆస్కారం లేకుండా ఆటో-మ్యూటేషన్ ప్రక్రియను వంద శాతం అమలు చేస్తున్నారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ కాగానే భూమి రికార్డులు వెంటనే మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు నిర్వహించిన 17 వేల గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. ముఖ్యంగా డీఆర్వోల వద్ద ఉన్న అధికారాలను ఆర్డీవోలకు వికేంద్రీకరించడం ద్వారా అర్జీల పరిష్కారం వేగవంతమైంది.

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఇనాం భూముల సమస్యపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22ఏ  నుంచి తొలగించడంతో వేలాది మంది రైతులకు ఉపశమనం లభించింది. అలాగే, 2016 కంటే ముందు ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్‌లో పట్టాలు పొందిన పేదలకు తమ ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. వారసత్వంగా వచ్చే ఆస్తుల రిజిస్ట్రేషన్ ఫీజులను భారీగా తగ్గించి, కేవలం 100 నుండి 1,000 రూపాయలకే ఆ పని పూర్తయ్యేలా సంస్కరణలు తెచ్చారు.

భవిష్యత్తులో భూ వివాదాలు లేని ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రికార్డుల భద్రత కోసం బ్లాక్ చైన్ సాంకేతికతను వాడుతూ, ప్రతి పాసు పుస్తకానికి క్యూఆర్ కోడ్, యూనిక్ నంబర్ కేటాయించారు. దీనివల్ల ఎక్కడ ఉన్నా తమ భూమి వివరాలను యజమానులు ఫోన్ ద్వారా సరిచూసుకోవచ్చు. భూ ఆక్రమణలను అరికట్టేందుకు 'ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్-2024' వంటి కఠిన చట్టాలను అమలులోకి తెచ్చి, సామాన్యుల ఆస్తులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. మొత్తానికి, 22 నెలల పాలనలో రెవెన్యూ శాఖ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు.

Spotlight

Read More →