Gongura Pachadi: గోంగూర పచ్చడి ఇలా చేశారంటే ముద్ద అన్నం కూడా వదిలిపెట్టరు... అందులోకైతే అదిరిపోయే కాంబినేషన్ ..!! Cooking Tips: చపాతీలు గట్టిగా వస్తున్నాయా? ఈ చిన్న చిట్కాతో దూది లాంటి మెత్తటి 'lలేయర్ చపాతీలు మీ సొంతం! Vankaya Royyala Curry: వంకాయ ఎండు రొయ్యల కూర.. ఈ చిట్కాతో వండితే బిర్యానీ కూడా దిగదుడుపే! Gongura Chicken: నోరూరించే గోంగూర చికెన్.. ఈ కొలతలతో చేస్తే ముక్కకి పులుపు పట్టి గ్రేవీ అదిరిపోతుంది! ఇలా ఒకసారి ట్రై చేయండి..!! Plum Cake: నోరూరించే ప్లం కేక్.. ఇంట్లోనే బేకరీ స్టైల్ రుచితో.. ఇలా ఒక్కసారి ట్రై చేయండి..!! Andhra Style Nalla Karam: అమ్మమ్మల కాలం నాటి నల్ల కారం ఒకసారి ఇలా ట్రై చేయండి.. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుంటే ఓహో అనాల్సిందే..!! Sankranti special: సంక్రాంతి వేళ రికార్డు విందు…! కోనసీమలో కొత్త అల్లుడికి అరుదైన సత్కారం! Traditional Sweets: సంక్రాంతి సాంప్రదాయంలో.... ఏడాదికి ఒక్కసారి మాత్రమే చేసే ఆ ప్రత్యేక వంటకం మీకు ఇంకా గుర్తుందా? Festival Recipes: ఆంధ్ర స్టైల్ పందెం కోడి కర్రీ – ఈ సంక్రాంతికి ఒకసారి ట్రై చేస్తే గుర్తుండిపోతుంది..!! Protein Rich Foods: చేప తలకాయను పారేస్తున్నారా? అదే మీ ఆరోగ్యానికి గోల్డెన్ ఫుడ్ అని తెలిస్తే షాక్‌ అవుతారు! Gongura Pachadi: గోంగూర పచ్చడి ఇలా చేశారంటే ముద్ద అన్నం కూడా వదిలిపెట్టరు... అందులోకైతే అదిరిపోయే కాంబినేషన్ ..!! Cooking Tips: చపాతీలు గట్టిగా వస్తున్నాయా? ఈ చిన్న చిట్కాతో దూది లాంటి మెత్తటి 'lలేయర్ చపాతీలు మీ సొంతం! Vankaya Royyala Curry: వంకాయ ఎండు రొయ్యల కూర.. ఈ చిట్కాతో వండితే బిర్యానీ కూడా దిగదుడుపే! Gongura Chicken: నోరూరించే గోంగూర చికెన్.. ఈ కొలతలతో చేస్తే ముక్కకి పులుపు పట్టి గ్రేవీ అదిరిపోతుంది! ఇలా ఒకసారి ట్రై చేయండి..!! Plum Cake: నోరూరించే ప్లం కేక్.. ఇంట్లోనే బేకరీ స్టైల్ రుచితో.. ఇలా ఒక్కసారి ట్రై చేయండి..!! Andhra Style Nalla Karam: అమ్మమ్మల కాలం నాటి నల్ల కారం ఒకసారి ఇలా ట్రై చేయండి.. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుంటే ఓహో అనాల్సిందే..!! Sankranti special: సంక్రాంతి వేళ రికార్డు విందు…! కోనసీమలో కొత్త అల్లుడికి అరుదైన సత్కారం! Traditional Sweets: సంక్రాంతి సాంప్రదాయంలో.... ఏడాదికి ఒక్కసారి మాత్రమే చేసే ఆ ప్రత్యేక వంటకం మీకు ఇంకా గుర్తుందా? Festival Recipes: ఆంధ్ర స్టైల్ పందెం కోడి కర్రీ – ఈ సంక్రాంతికి ఒకసారి ట్రై చేస్తే గుర్తుండిపోతుంది..!! Protein Rich Foods: చేప తలకాయను పారేస్తున్నారా? అదే మీ ఆరోగ్యానికి గోల్డెన్ ఫుడ్ అని తెలిస్తే షాక్‌ అవుతారు!

Cooking Tips: చపాతీలు గట్టిగా వస్తున్నాయా? ఈ చిన్న చిట్కాతో దూది లాంటి మెత్తటి 'lలేయర్ చపాతీలు మీ సొంతం!

తక్కువ సమయంలో దూది లాంటి పుల్కాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. పెరుగుతో పిండి కలిపే విధానం మరియు లేయర్ ఫోల్డింగ్ టెక్నిక్ మీ కోసం..

Published : 2026-02-02 09:23:00

సాధారణంగా ప్రతి ఇంట్లో ఉదయం టిఫిన్ లేదా రాత్రి భోజనంలో చపాతీ అనేది ఒక భాగమైపోయింది. అయితే, చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏమిటంటే.. చపాతీలు చేసిన కొద్దిసేపటికే గట్టిగా మారిపోవడం లేదా వాటిని ఒక్కొక్కటిగా తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టడం. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ, తక్కువ సమయంలో ఎక్కువ చపాతీలను పొరలు పొరలుగా, అత్యంత మెత్తగా ఎలా తయారు చేసుకోవాలో  తెలుసుకుందాం.

మెత్తటి చపాతీల కోసం పిండి కలిపే విధానమే అత్యంత ముఖ్యం. రెండు కప్పుల గోధుమ పిండికి తగినంత ఉప్పుతో పాటు, రెండు టేబుల్ స్పూన్ల తాజా పెరుగును కలపడం ఇక్కడ అసలైన చిట్కా. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ గోధుమ పిండిని మృదువుగా మార్చడమే కాకుండా, చపాతీలు ఎక్కువ సేపు సాఫ్ట్‌గా ఉండేలా చేస్తుంది. పిండిని కలిపేటప్పుడు ఒక్కసారిగా నీళ్లు పోయకుండా, వేళ్లతో మెల్లగా కలుపుతూ, ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఒత్తిడిని ఇస్తూ మర్దనా చేయాలి. పిండి పైన ఎక్కడా పగుళ్లు లేకుండా నునుపుగా వచ్చే వరకు కలిపి, కనీసం ఐదు నిమిషాల పాటు విశ్రాంతినివ్వాలి.

సాధారణంగా మనం చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీలు పాముతాము. కానీ సమయం ఆదా కావాలంటే, ఒక పెద్ద పిండి ముద్దను తీసుకుని పెద్ద రొట్టెలా చేసుకోవాలి. దీనిపై చేతి వేళ్లతో అక్కడక్కడా చిన్న గుంతలు  చేసి, నూనెను అప్లై చేయాలి. ఆ తర్వాత పొడి పిండి చల్లుకుంటూ పొరలు పొరలుగా మడత పెట్టాలి ఇలా మడత పెట్టిన పిండిని సమాన భాగాలుగా కట్ చేసుకుంటే, ఒక్కో భాగంలో అనేక లేయర్లు సహజంగానే ఏర్పడతాయి. ఈ పద్ధతి ద్వారా ఐదు నుండి ఆరు చపాతీలను ఒకేసారి సిద్ధం చేసుకోవచ్చు.

చపాతీలను కాల్చేటప్పుడు పెనం బాగా వేడిగా ఉండాలి. హై ఫ్లేమ్ మీద వేసిన తర్వాత చిన్న బుడగలు రాగానే తిప్పి, అంచుల వెంబడి అట్లకాడతో నొక్కుతూ కాల్చాలి. ఇలా చేయడం వల్ల లోపలి వరకు సమానంగా ఉడుకుతాయి. అర టీస్పూన్ నూనెతో రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే, వేడి వేడి లేయర్ చపాతీలు సిద్ధమవుతాయి.

నూనె ఇష్టపడని వారు  చిన్న పిండి ముద్దను తీసుకుని పల్చగా రుద్దుకోవాలి. పెనంపై వేసి లైట్‌గా బబుల్స్ రాగానే నేరుగా మంటపై  వేయాలి. ఇలా చేయడం వల్ల పుల్కా బంతిలా పొంగుతుంది. ఇది కేవలం రుచికరమే కాకుండా, జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది.ఈ చిట్కాలను పాటిస్తే వంటగదిలో గంటల తరబడి శ్రమించాల్సిన అవసరం ఉండదు. హోటల్ స్టైల్ లో సాఫ్ట్ చపాతీలను మీ ఇంట్లోనే రుచి చూడవచ్చు.

Spotlight

Read More →