Andhra Style Nalla Karam: అమ్మమ్మల కాలం నాటి నల్ల కారం ఒకసారి ఇలా ట్రై చేయండి.. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుంటే ఓహో అనాల్సిందే..!! Sankranti special: సంక్రాంతి వేళ రికార్డు విందు…! కోనసీమలో కొత్త అల్లుడికి అరుదైన సత్కారం! Traditional Sweets: సంక్రాంతి సాంప్రదాయంలో.... ఏడాదికి ఒక్కసారి మాత్రమే చేసే ఆ ప్రత్యేక వంటకం మీకు ఇంకా గుర్తుందా? Festival Recipes: ఆంధ్ర స్టైల్ పందెం కోడి కర్రీ – ఈ సంక్రాంతికి ఒకసారి ట్రై చేస్తే గుర్తుండిపోతుంది..!! Protein Rich Foods: చేప తలకాయను పారేస్తున్నారా? అదే మీ ఆరోగ్యానికి గోల్డెన్ ఫుడ్ అని తెలిస్తే షాక్‌ అవుతారు! cheese price: ఈ చీజ్ ఎప్పుడైనా తిన్నారా? దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! Mutton: మటన్‌లోని ఈ పార్ట్ తినండి - ఎముకలకు ఉక్కు బలం! తయారీ విధానం.. అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడు! Food Policy: ‘ఆహారమే ఔషధం’ ఫార్ములా…! అమెరికాలో కొత్త డైట్ పాలసీ…! Sankranthi: సంక్రాంతి మార్కెట్‌లో నాటుకోడి రాజ్యం.. సామాన్యుడికి అందని ధర! Keema Curry: సోయా కీమా కర్రీ తిన్నారా..ఒక్కసారి తింటే ఇంట్లో మళ్లీ మళ్లీ చేయాల్సిందే! Andhra Style Nalla Karam: అమ్మమ్మల కాలం నాటి నల్ల కారం ఒకసారి ఇలా ట్రై చేయండి.. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుంటే ఓహో అనాల్సిందే..!! Sankranti special: సంక్రాంతి వేళ రికార్డు విందు…! కోనసీమలో కొత్త అల్లుడికి అరుదైన సత్కారం! Traditional Sweets: సంక్రాంతి సాంప్రదాయంలో.... ఏడాదికి ఒక్కసారి మాత్రమే చేసే ఆ ప్రత్యేక వంటకం మీకు ఇంకా గుర్తుందా? Festival Recipes: ఆంధ్ర స్టైల్ పందెం కోడి కర్రీ – ఈ సంక్రాంతికి ఒకసారి ట్రై చేస్తే గుర్తుండిపోతుంది..!! Protein Rich Foods: చేప తలకాయను పారేస్తున్నారా? అదే మీ ఆరోగ్యానికి గోల్డెన్ ఫుడ్ అని తెలిస్తే షాక్‌ అవుతారు! cheese price: ఈ చీజ్ ఎప్పుడైనా తిన్నారా? దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! Mutton: మటన్‌లోని ఈ పార్ట్ తినండి - ఎముకలకు ఉక్కు బలం! తయారీ విధానం.. అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడు! Food Policy: ‘ఆహారమే ఔషధం’ ఫార్ములా…! అమెరికాలో కొత్త డైట్ పాలసీ…! Sankranthi: సంక్రాంతి మార్కెట్‌లో నాటుకోడి రాజ్యం.. సామాన్యుడికి అందని ధర! Keema Curry: సోయా కీమా కర్రీ తిన్నారా..ఒక్కసారి తింటే ఇంట్లో మళ్లీ మళ్లీ చేయాల్సిందే!

Sankranti special: సంక్రాంతి వేళ రికార్డు విందు…! కోనసీమలో కొత్త అల్లుడికి అరుదైన సత్కారం!

 సంక్రాంతి పండుగ వేళ కోనసీమలోని ఓ కుటుంబం తమ కొత్త అల్లుడికి ఇచ్చిన ఆతిథ్యం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సంప్రదాయం, ఆప్యాయత, అతిథి సత్క

2026-01-17 20:58:00
Lucky Draw: లక్కీ డ్రాల ముసుగులో భారీ మోసం… సెలబ్రిటీలైనా వదిలేది లేదు.. హైదరాబాద్ సీపీ!

సంక్రాంతి పండుగ వేళ కోనసీమలోని ఓ కుటుంబం తమ కొత్త అల్లుడికి ఇచ్చిన ఆతిథ్యం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సంప్రదాయం, ఆప్యాయత, అతిథి సత్కారానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచేలా ఏకంగా 1,574 రకాల వంటకాలతో భారీ విందు ఏర్పాటు చేసి గోదావరి జిల్లాల మర్యాదను మరోసారి దేశానికి చాటిచెప్పింది. ఈ అరుదైన ఘటన కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామంలో చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ విందు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Chabahar Port: ట్రంప్ ఆంక్షలపై భారత్ స్పందన.. చాబహార్ పోర్టుపై స్పష్టత!

ఆదుర్రు గ్రామానికి చెందిన విజ్జెపు వెంకటరత్నం, సుశీల దంపతులు తమ కుమార్తె కీర్తిశ్రీని గత ఏడాది ఫిబ్రవరిలో పి. గన్నవరం మండలం ముంగండకు చెందిన సాయి శరత్‌కు వివాహం చేసి ఇచ్చారు. ఈ ఏడాది సంక్రాంతి ఈ దంపతులకు తొలి పండుగ కావడంతో, సంప్రదాయం ప్రకారం అల్లుడు గురువారం అత్తవారింటికి వచ్చాడు. ఈ తొలి పండుగను జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలని భావించిన అత్తమామలు, అల్లుడికి అపూర్వమైన ఆతిథ్యం ఇవ్వాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా గ్రామస్థుల సహకారంతో భారీ ఏర్పాట్లు చేశారు.

UK Gangs: బ్రిటన్ లో పాకిస్థానీ గ్యాంగుల దారుణాలు... సిక్కు, హిందూ అమ్మాయిలే టార్గెట్! బయటపడ్డ షాకింగ్ నిజాలు..

ఈ విందులో సంప్రదాయ పిండివంటలు, తీపి పదార్థాలు, కూరలు, పచ్చళ్లు, పండ్లు, శీతల పానీయాలు ఇలా మొత్తం 1,574 రకాల వంటకాలను వడ్డించారు. ఒక్కో వంటకం ప్రత్యేక శ్రద్ధతో, సంప్రదాయ రుచిని కాపాడుతూ తయారు చేయడం విశేషం. అంతేకాకుండా, ఏడాదిలోని 12 నెలలకు ప్రతీకగా అల్లుడికి 12 ప్రత్యేక బహుమతులు అందించి తమ ప్రేమాభిమానాలను వ్యక్తం చేశారు. ఈ అపూర్వ ఆతిథ్యాన్ని చూసి అల్లుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొందరు దీన్ని “కోనసీమ మర్యాదకు సజీవ ఉదాహరణ”గా అభివర్ణించారు.

Medaram prasadam: భక్తులకు శుభవార్త.. మేడారం ప్రసాదం డోర్ డెలివరీ!

ఇలాంటి విందులు ఇటీవల కాలంలో గోదావరి జిల్లాల్లో ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. ఇటీవలే ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ఓ కొత్త అల్లుడికి 1,116 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేయగా, ఇప్పుడు ఆదుర్రు గ్రామంలో జరిగిన ఈ విందుతో ఆ రికార్డు బద్దలైంది. అంతకుముందు విశాఖలో ఓ కొత్త అల్లుడికి 290 రకాల వంటకాలతో విందు ఇవ్వడం, తెనాలిలో 158 రకాల వంటకాలతో అతిథ్యమిచ్చిన ఘటనలు కూడా చర్చనీయాంశమయ్యాయి. అయితే, 1,574 వంటకాలతో ఏర్పాటు చేసిన ఈ సంక్రాంతి విందు మాత్రం కోనసీమ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది.

తిరుమల భక్తులకు అలర్ట్.. ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా టికెట్ల షెడ్యూల్ వచ్చేసింది!
Pongal Festival: జల్లికట్టు వీరులకు సీఎం స్టాలిన్ బిగ్ గిఫ్ట్.. ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక ప్రకటన.!!
Traffic: సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్న వారికి అలర్ట్.. హైదరాబాద్ – విజయవాడ హైవేపై ట్రాఫిక్ మళ్లింపు..!
Indian students: అమెరికాలో ఇండియన్ స్టూడెంట్లకు షాక్.. రెస్టారెంట్‌లో పని చేస్తూ అరెస్ట్!
Teeth Health: మీ దంతాలే మీ ఆయుష్షును నిర్ణయిస్తాయి.. జపాన్ అధ్యయనం బయటపెట్టిన షాకింగ్ నిజాలు!
Pudina Tomato Chutney: అన్నం నుంచీ ఇడ్లీ దోసా వరకు సూపర్ రుచి.. పుదీనా టమాటా పల్లీల పచ్చడి!

Spotlight

Read More →