Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే... కాశ్మీర్ వెళ్లాలనుకునే వారికి IRCTC గుడ్ న్యూస్.. పూర్తి బడ్జెట్ వివరాలు! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే... కాశ్మీర్ వెళ్లాలనుకునే వారికి IRCTC గుడ్ న్యూస్.. పూర్తి బడ్జెట్ వివరాలు!

Highway Extension: కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఆ 15 జిల్లాల రహదారులకు మారనున్న రూపురేఖలు!

తెలంగాణలో రవాణా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందబోతోంది. ఇప్పటికే పలు జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 1

Published : 2025-07-21 16:15:00

తెలంగాణలో రవాణా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందబోతోంది. ఇప్పటికే పలు జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 15 జాతీయ రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న మొత్తం 1,123 కిలోమీటర్ల రోడ్లు త్వరలోనే నాలుగు లేన్లుగా మారనున్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం సుమారు రూ.39,690 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసారు.

అధిక రద్దీ ఉన్న మార్గాల్లో విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ముఖ్యంగా తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే రహదారులు, వేగవంతమైన రహదారుల అనుసంధానాన్ని మెరుగుపరచేలా ఈ ప్రణాళిక ఉంది. ఈ ప్రాజెక్టుల అమలుకు ముందు భూ సేకరణ, అటవీ మరియు పర్యావరణ అనుమతులు రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. తర్వాత కేంద్రానికి నివేదిక పంపిన అనంతరం నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

విస్తరణ జరిగే రహదారుల్లో టోల్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. రోడ్ల అభివృద్ధితో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆస్తి అభివృద్ధి రంగం కూడా పుంజుకునే అవకాశముంది. ముఖ్యంగా జాతీయ రహదారి 167లో జడ్చర్ల–కోదాడ మార్గం (219 కిలోమీటర్లు) అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ మార్గంలో రెండు లేన్లు మాత్రమే ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విస్తరణకు ఎంపికైన ప్రధాన రహదారుల్లో జాతీయ రహదారి 63 (బోధన్–నిజామాబాద్, నిజామాబాద్–జగదల్‌పూర్), జాతీయ రహదారి 163 (హైదరాబాద్–భూపాలపట్నం, మన్నెగూడ–రావులపల్లి), జాతీయ రహదారి 365 (నకిరేకల్–తానంచర్ల, సూర్యాపేట–జనగాం), జాతీయ రహదారి 353సి (పరకాల, భూపాలపల్లి మారు మార్గం), జాతీయ రహదారి 61 (కళ్యాణ్–నిర్మల్) వంటి మార్గాలు ఉన్నాయి. ఇవి రవాణా దృక్పథంలో ప్రాధాన్యమైనవిగా, భవిష్యత్తులో రాష్ట్రాభివృద్ధికి మద్దతుగా నిలవనున్నాయి.

Spotlight

Read More →