Railway: ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్..! 11 ప్రత్యేక రైళ్లతో రంగంలోకి దక్షిణ మధ్య రైల్వే..! Train: ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు…! జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి ఆ స్టేషన్ లోనూ ఆగుతుంది! Railways: నీలం, ఎరుపు, ఆకుపచ్చ…! రైలు కోచ్‌ల రంగుల వెనుక షాకింగ్ నిజాలు! Railway: రైల్వే రంగంలో ఏపీకి జాక్‌పాట్..! వేల కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Railway: వారికి శుభవార్త.. ఆ ప్రాంతం మీదుగా డైలీ ప్యాసింజర్ రైలు…! రైల్వే శాఖ కీలక అప్‌డేట్! Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి భారీ గుడ్‌న్యూస్..! 600 ప్రత్యేక రైళ్లతో రైల్వే మెగా ప్లాన్! Old coaches: పాత బోగీలకు గుడ్‌బై… ఆధునిక ఎల్హెచ్‌బి బోగీలకు గ్రీన్ సిగ్నల్! Railway: ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్..! 11 ప్రత్యేక రైళ్లతో రంగంలోకి దక్షిణ మధ్య రైల్వే..! Train: ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు…! జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి ఆ స్టేషన్ లోనూ ఆగుతుంది! Railways: నీలం, ఎరుపు, ఆకుపచ్చ…! రైలు కోచ్‌ల రంగుల వెనుక షాకింగ్ నిజాలు! Railway: రైల్వే రంగంలో ఏపీకి జాక్‌పాట్..! వేల కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Railway: వారికి శుభవార్త.. ఆ ప్రాంతం మీదుగా డైలీ ప్యాసింజర్ రైలు…! రైల్వే శాఖ కీలక అప్‌డేట్! Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి భారీ గుడ్‌న్యూస్..! 600 ప్రత్యేక రైళ్లతో రైల్వే మెగా ప్లాన్! Old coaches: పాత బోగీలకు గుడ్‌బై… ఆధునిక ఎల్హెచ్‌బి బోగీలకు గ్రీన్ సిగ్నల్!

Railway: వారికి శుభవార్త.. ఆ ప్రాంతం మీదుగా డైలీ ప్యాసింజర్ రైలు…! రైల్వే శాఖ కీలక అప్‌డేట్!

2025-12-23 17:38:00
Swiggyవరుసగా పదో ఏడాది బిర్యానీదే అగ్రస్థానం..! స్విగ్గీ సరికొత్త రికార్డు!


ఆంధ్రప్రదేశ్‌లోని రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక శుభవార్త అందించింది. గుంతకల్లు – మార్కాపురం మధ్య డైలీ ప్యాసింజర్ రైలును నడపాలన్న ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో నంద్యాల జిల్లా ప్రజల్లో, ముఖ్యంగా రోజువారీ రైలు ప్రయాణికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Electric Cars: భారత రోడ్లపై 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు…! ఈవీ కింగ్‌గా టాటా!

ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ బైరెడ్డి శబరి నంద్యాల జిల్లాలోని రైల్వే సేవలపై కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. నంద్యాల మీదుగా గుంతకల్లుకు పగటి పూట మెమో లేదా ప్యాసింజర్ రైలు నడపాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఆమె కోరారు. ప్రస్తుతం ఈ మార్గంలో నడిచే రైళ్లన్నీ రాత్రి వేళల్లోనే ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు అర్ధరాత్రి ప్రయాణాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Koratala Siva: కొరటాల శివ బాలయ్య కాంబోలో ఊర మాస్ సినిమా.. టాలీవుడ్ బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తున్న బిగ్ కాంబో!

నంద్యాల నుంచి గుంతకల్లుకు వెళ్లే నాలుగు రైళ్లు పూర్తిగా రాత్రి సమయాల్లో మాత్రమే ఉండటం ఈ మార్గాన్ని ఉపయోగించే ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. పగటి సమయంలో రైలు సౌకర్యం లేకపోవడంతో రోడ్డు మార్గాలపై ఆధారపడాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల మీదుగా గుంతకల్లు – మార్కాపురం వరకు రోజువారీ ప్యాసింజర్ రైలును ప్రారంభిస్తే వేలాది మంది ప్రయాణికులకు ఉపశమనం కలుగుతుందని ఎంపీ బైరెడ్డి శబరి రైల్వే శాఖకు వివరించారు.

CID interrogate: బెట్టింగ్ యాప్ కేసులో నటి మంచు లక్ష్మిని విచారించిన CID.. బయ్యా సన్నీ యాదవ్, రీతూ చౌదరి హాజరు!

ఇదే కాకుండా బేతంచెర్ల మీదుగా దుపాడు వరకూ కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కూడా గతంలో ఎంపీ కేంద్రానికి సమర్పించారు. ప్రాంత అభివృద్ధి, రవాణా సౌలభ్యం దృష్ట్యా ఈ మార్గంలో కొత్త రైలు సేవలు అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఈ అంశాలపై అప్పట్లోనే రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. తాజాగా రైల్వే శాఖ గుంతకల్లు – మార్కాపురం డైలీ ప్యాసింజర్ రైలు ప్రతిపాదన పరిశీలనలో ఉందని ప్రకటించడంతో, త్వరలోనే ఈ మార్గంలో పగటి పూట రైలు సేవలు అందుబాటులోకి వస్తాయన్న ఆశలు బలపడుతున్నాయి.
 

Illegal Immigrants: అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్…! దేశం వదిలితే రూ.2.7 లక్షలు + ఫ్రీ ఫ్లైట్!
Education News: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 2026 ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే!!
Tere Ishq Mein: ధనుష్ కృతి సనన్ రొమాంటిక్ డ్రామా తేరే ఇష్క్ మే... డిజిటల్ రిలీజ్‌కు రెడీ!
సంక్రాంతి కంటే ముందే పండగ మొదలు.. స్టూడెంట్స్, ఎంప్లాయీస్ కి పండగే.. జనవరిలో సెలవుల షెడ్యూల్ ఇదే! ఇప్పుడే ప్లాన్ చేసుకోండి!
హయత్ నగర్ హైవేపై నిప్పులు చిమ్మిన ఆగ్రహం.. హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్!

Spotlight

Read More →