టమాటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! లేకపోతే..

2026-01-10 14:30:00
Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన!

మన భారతీయ వంటకాల్లో టమాటా లేనిదే ఏ కూర పూర్తి కాదు. అందుకే మనం మార్కెట్‌కు వెళ్ళినప్పుడు కిలోల కొద్దీ టమాటాలను తెచ్చుకుని, అవి పాడవకూడదని వెంటనే ఫ్రిజ్‌లో కుక్కేస్తుంటాం. నిజానికి, ఇలా చేయడం వల్ల మనం టమాటాలోని అసలైన రుచితో పాటు ఆరోగ్యకరమైన పోషకాలను కూడా కోల్పోతున్నామని మీకు తెలుసా?

నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా ఆయన నియామకం! జీఓ విడుదల..!

పండని టమాటాలను ఫ్రిజ్‌లో పెట్టవచ్చా.?
చాలామంది మార్కెట్ నుంచి కొంచెం పచ్చగా లేదా గట్టిగా ఉన్న టమాటాలను తెచ్చి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. టమాటాలు సహజంగా పండడానికి మితమైన వేడి, గాలి అవసరం. ఫ్రిజ్‌లో ఉండే చల్లని ఉష్ణోగ్రత టమాటా పండే ప్రక్రియను (Ripening Process) ఆపేస్తుంది. ఇలా ఫ్రిజ్‌లో పెట్టిన టమాటాలు పండకపోగా, వాటిలోని సహజమైన రుచి తగ్గిపోయి చప్పగా తయారవుతాయి. వాటికి ఉండాల్సిన ప్రత్యేకమైన వాసన కూడా మాయమవుతుంది. పండని టమాటాలను గది ఉష్ణోగ్రత వద్ద, నేరుగా ఎండ తగలకుండా పక్కన పెడితే అవి సహజంగా, రుచిగా పండుతాయి.

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు! 135 ఏళ్ల తర్వాత జనవరిలో..

ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు ..?
టమాటాలను వారం కంటే ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో ఉంచడం ఆరోగ్యానికి హానికరం. బయటకి చూడటానికి బాగానే ఉన్నా, వారం దాటిన టమాటాలు లోపలి నుండి కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. దీనిని మనం గమనించకుండా కూరల్లో వేస్తే జీర్ణసంబంధిత సమస్యలు వస్తాయి. రిఫ్రిజిరేటర్‌లో ఉండే అధిక తేమ వల్ల టమాటాల తొడిమల వద్ద మనకు తెలియకుండానే నల్లటి బూజు చేరుతుంది. ఇవి విషపూరితమైన బ్యాక్టీరియాను విడుదల చేస్తాయి.

Tollywood: సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.... టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ! ఫస్ట్ లుక్...

ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం.?
పాడైపోయిన లేదా ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం నిల్వ ఉన్న టమాటాలను తింటే కలిగే నష్టాలు.. వికారం, వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులు ఇటువంటి టమాటాలు తింటే తీవ్రమైన ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. నిల్వ ఉన్న టమాటాల్లో పెరిగే సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది.

Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ!

టమాటాలు తాజాగా ఉంచుకోవడానికి చిట్కాలు ఏమైనా ఉన్నాయా.?
మీ ఆరోగ్యం మరియు వంటల రుచి పెరగాలంటే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. వారానికి సరిపడా ఒకేసారి కాకుండా, రెండు మూడు రోజులకు ఒకసారి తాజాగా కొనుక్కోవడం ఉత్తమం. ఒకవేళ ఫ్రిజ్‌లో పెట్టాల్సి వస్తే, వాటిని ప్లాస్టిక్ కవర్లలో కాకుండా, ఫ్రిజ్‌లో కింద ఉండే వెజిటబుల్ డ్రాయర్‌లో విడిగా ఉంచండి. కూరలో వేసే ముందు టమాటా లోపల నల్లగా ఉన్నా లేదా కొంచెం తేడా వాసన వస్తున్నా మొహమాటపడకుండా పడేయండి.

Osteoarthritis: వృద్ధాప్యంలో కీళ్ల నొప్పులకు చెక్..! స్టాన్‌ఫోర్డ్ శాస్త్రవేత్తల సంచలన పరిశోధన!
US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!!
AP Government: సంక్రాంతి పేరుతో బస్సు టికెట్ల దోపిడీ.. ఏపీ సర్కార్ సీరియస్!
Technology News: గూగుల్ ఉచిత సేవల వెనుక అసలు కథ.. ఆదాయం ఎలా వస్తుందంటే?
Rajasaab: బాక్సాఫీస్ హీట్.. టికెట్ రేట్ల వివాదం.. రాజాసాబ్ చుట్టూ చర్చ!
Ayodhya: అయోధ్యలో కఠిన ఆంక్షలు..! మాంసం, మద్యం విక్రయాలపై మరోసారి ఉక్కుపాదం!
International Politics News: నెతన్యాహును కిడ్నాప్ చేయండి.. ట్రంప్‌కు పాకిస్తాన్ మంత్రి సవాల్..!!
Amaravathi Icon: చంద్రబాబు గ్రీన్ సిగ్నల్… రూ.1.85 కోట్లతో అమరావతి ఐకాన్‌కు కొత్త ఊపిరి!
G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!!

Spotlight

Read More →