Salary Cut Rule: ఏపీలో ఆ ఉద్యోగులకు అలర్ట్.. ఇకపై లేట్‌గా వస్తే ఆ రోజు జీతం కట్!

2026-01-16 10:00:00
New Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. రూ.20 లక్షల కవరేజ్‌తో కొత్త బీమా ప్రారంభం..!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల పనితీరును మెరుగుపరచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా సమయానికి విధులకు హాజరుకావాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆలస్యంగా కార్యాలయానికి వచ్చినట్లయితే ఆ రోజు వేతనంలో కోత (SalaryCutRule) విధించనున్నారు. ఈ నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో తీసుకున్న చర్యగా అధికారులు చెబుతున్నారు. సమయపాలనతో పాటు బాధ్యతాయుతమైన సేవలందించడమే ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.

Health Tips: నల్ల మిరియాలు రోజూ తీసుకుంటున్నారా?.. ఈ లాభాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..!!

ప్రభుత్వం ఇప్పటికే సచివాలయ వ్యవస్థలో పలు మార్పులు చేపట్టింది. ఇటీవల గ్రామ సచివాలయాలను ‘స్వర్ణ గ్రామాలు’, వార్డు సచివాలయాలను ‘స్వర్ణ వార్డులు’గా పేరు మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదే క్రమంలో పాలనా విధానాల్లో కూడా క్రమశిక్షణ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఉద్యోగుల హాజరు, సమయపాలన విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది. దీనిలో భాగంగానే ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనుంది.

Irans airspace: ఇరాన్ ఎయిర్‌స్పేస్ మూసివేత.. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రభావం!

ఇకపై సచివాలయ ఉద్యోగులు ఫేషియల్ రికగ్నిషన్ (Facial Recognition) విధానం ద్వారా రోజూ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. పని వేళలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించారు. ప్రతి ఉద్యోగి ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఆన్‌లైన్ ద్వారా హాజరు వేయాలి. నిర్ణీత సమయంలో హాజరు నమోదు చేయకపోతే, ఆ రోజు విధులకు రాలేదని పరిగణించి వేతనంలో కోత విధిస్తారు. దీనివల్ల ఉద్యోగుల్లో క్రమశిక్షణ పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్! ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ప్రతి జిల్లలో..

వైసీపీ ప్రభుత్వం 2019లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. ఒక్కో సచివాలయంలో 11 నుంచి 13 మంది ఉద్యోగులను నియమించారు. గతంలో వీరి విధులపై మాతృశాఖల నియంత్రణ ఉండేది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, విధుల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Commonwealth: కామన్వెల్త్ స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. 75 ఏళ్ల పాటు దేశ పార్లమెంటుగా!

ఉదాహరణకు విజయనగరం జిల్లాలో 777 పంచాయతీలు ఉండగా, 626 గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో సుమారు 5,781 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే చాలామంది ఉద్యోగులు సమయానికి కార్యాలయానికి రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మొత్తంగా ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తే సచివాలయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

అందుబాటులోకి వచ్చిన విజయవాడ వెస్ట్ బైపాస్.. అన్ని రకాల వాహనాలను!
5 రోజుల్లో ఎన్ని లక్షల వాహనాలు ప్రయాణించాయంటే..! శనివారం ఒక్కరోజే అత్యధికంగా - హైదరాబాద్ నుంచి విజయవాడ దారిలో.!
అనుష్క శెట్టి, శ్రీనిధి శెట్టి బంధువులా? తొలి సినిమా 'కేజీఎఫ్'తోనే...
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు పొంచి ఉన్న ముప్పు.. బోర్డు డైరెక్టర్ వ్యాఖ్యలపై ఆటగాళ్ల తిరుగుబాటు!
టాలీవుడ్ లో సంచలనం.. ఆ సినిమాలో హీరోయిన్ గా సౌత్ కొరియా అమ్మాయి.!

Spotlight

Read More →