LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: అమరావతిలో హజ్ హౌస్ నిర్మిస్తాం.. 21 నెలల్లో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు.!

Chandrababu: ఇమామ్, మౌజన్‌లకు ఇచ్చే గౌరవ వేతన బకాయిలు రూ.45 కోట్లు వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో నూతనంగా హజ్ హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

AndhraPravasi News Desk 2 min read
Chandrababu: అమరావతిలో హజ్ హౌస్ నిర్మిస్తాం.. 21 నెలల్లో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు.!
  • విజయవాడ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
     
  • ఇమామ్, మౌజన్‌ల గౌరవవేతన బకాయిలు రూ.45 కోట్లు వెంటనే విడుదల చేస్తాం…

Chandrababu: ఇమామ్, మౌజన్‌లకు ఇచ్చే గౌరవ వేతన బకాయిలు రూ.45 కోట్లు వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో నూతనంగా హజ్ హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింలకు 21 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు అందించిందని వివరించారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌లో ప్రభుత్వం తరపున ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్ష చేసిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్నాం. 

అన్ని జిల్లాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశాం. రంజాన్ పండుగను పురస్కరించుకుని పేదలకు దానం చేస్తే సంతోషంగా ఉంటారని మహ్మద్ ప్రవక్త బోధించారు. పేదలకు సాయం చేయడమే ఖురాన్ ప్రవచించిన సూక్తి. ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధిలోకి తేవటమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ముస్లింలలో 4.38 లక్షల మందికి ఇస్తూ ఏడాదికి రూ.3,511 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 4.5 లక్షల మంది ముస్లిం విద్యార్దులకు తల్లికి వందనం ఇస్తున్నాం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు 19,215 మందికి రూ.264 కోట్లు విడుదల చేశాం. దీపం-2.0 పథకం కింద 6.20 లక్షల కుటుంబాలకు రూ.158 కోట్లతో సిలిండర్లకు ఖర్చు చేస్తున్నాం. ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజన్లకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనంగా రూ.180 కోట్లు అందించాం. మరో రూ.45 కోట్ల బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించాను.”అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ముస్లింల మనోభావాలను కూటమి ప్రభుత్వం గౌరవిస్తుంది
“అర్హత కలిగిన ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తున్నాం. వివాహ లైసెన్స్ గడువు 3 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచాం. 347 మంది ముస్లింలు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్రకు వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నాం. 33,275 మందికి ఆర్ధిక చేయూత కింద రూ.193 కోట్లు ఇచ్చాం. యువతకు నైపుణ్యాలు అందించి మెరుగైన ఉపాధి ఉద్యోగాలు దక్కేలా చేస్తున్నాం. గత పాలకులు జీవో 47 ద్వారా వక్ఫ్ బోర్డును వివాదాల్లోకి నెట్టారు. ఆ జీవోను రద్దు చేసి వక్ఫ్ బోర్డును పునర్వవ్యస్తీకరణ చేశాం. 1500 వక్ఫ్ ఆస్తులను సర్వే చేశాం. వక్ఫ్ ఆస్తులను కాపాడుతున్నాం. నూర్ బాషా ఫెడరేషన్‌ పేరును దూదేకుల ముస్లిం ఫైనాన్స్ కార్పోరేషనుగా మార్పు చేసి రూ.100 కోట్లు కేటాయించాం. 

గత బడ్జెట్లో మైనారిటీలకు రూ.5,434 కోట్లు కేటాయిస్తే... ఈసారి రూ.6,090 కోట్లు కేటాయించాం. ఉర్దూ అకాడమీకి గత పాలకులు రూ.1 లక్ష మాత్రమే ఇచ్చింది. కూటమి ప్రభుత్వంలో రూ.7 కోట్లు మంజూరు చేశాం. అబ్దుల్ హక్ అవార్డు కింద రూ.1 లక్ష నుంచి రూ.1.25 లక్షలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఉర్దూ ఘర్, షాధీ ఖానాల నిర్మాణానికి రూ.2.85 కోట్లు కేటాయించాం. ముస్లిం జీవన ప్రమాణాలు పెంచేలా చేస్తున్నాం. అన్ని మతాలను గౌరవిస్తా... అందరివాడిలా ఉంటా. పేదలను ఆదుకునేందుకు పీ4 తీసుకొచ్చాం. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటా’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విందులో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్, ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యేలు నజీర్, బోండా ఉమ, గద్దె రామ్మోహన్, పలువురు ప్రజా ప్రతినిధులు, ముస్లిం మైనార్టీ నేతలు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…