LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

TDP: "యూజ్ అండ్ కిల్" ఇదే జగన్ పొలిటికల్ పిక్చర్.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!

TDP: మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

AndhraPravasi News Desk 2 min read
TDP: "యూజ్ అండ్ కిల్" ఇదే జగన్ పొలిటికల్ పిక్చర్.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!

సొంత జిల్లాలో హత్య జరిగితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్లి పరామర్శించలేదు?

జగన్ కనుసన్నల్లోనే పెద్దదస్తగిరి హత్య జరిగింది..

మంగళగిరి: మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “యూజ్ అండ్ కిల్” అనేదే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ విధానమని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో వైసీపీ నాయకుల ఆగడాలు అధికారం కోల్పోయి రెండేళ్లు అయినా తగ్గలేదని మంత్రి మండిపడ్డారు. తాడేపల్లి కేంద్రంగా కమాండ్ కంట్రోల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా అరాచక రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు.

కడప జిల్లాలో జరిగిన పెద్ద దస్తగిరి హత్యపై మంత్రి ప్రత్యేకంగా స్పందించారు. ఆ హత్య జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని ఆయన ఆరోపించారు. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి సన్నిహితుడైన దస్తగిరి భూవివాదాల నేపథ్యంలో వైసీపీ వర్గాల చేతిలోనే హత్యకు గురయ్యాడని పేర్కొన్నారు. దస్తగిరి ఇంట్లో పోలీసుల తనిఖీల్లో వందల కోట్ల విలువైన భూముల డాక్యుమెంట్లు బయటపడటంతో భూదోపిడీ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు.

ఇతర ప్రాంతాల్లో చిన్న సంఘటనలకే పరామర్శకు వెళ్లే జగన్, తన సొంత జిల్లాలో జరిగిన ఈ హత్యపై ఎందుకు స్పందించలేదని మంత్రి ప్రశ్నించారు. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నారా చంద్రబాబు నాయుడు పై ఆరోపణలు చేసినట్లే, ఇప్పుడు దస్తగిరి హత్యను కూడా కూటమి ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.

డ్రైవర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబును ప్రస్తావిస్తూ, అలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం జగన్ రాజకీయ శైలిని చూపిస్తుందని అన్నారు. వైసీపీకి నిజంగా నైతిక విలువలు ఉంటే, అనంతబాబును వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు భూకబ్జాలు చేసి నిర్మించిన ఆస్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.

భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రాయలసీమలో వైసీపీ ప్రభావం తగ్గిపోయిందని, ప్రజలు ఇకపై అరాచక రాజకీయాలను సహించరని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో నైతిక విలువలు, బాధ్యతతో కూడిన పాలన అవసరమని ఆయన హితవు పలికారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…