LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Central Govt: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై కేంద్ర కేబినెట్ కీలక సమావేశం!

Central Govt: దేశం మొత్తం దృష్టి సారించిన కేంద్ర కేబినెట్ కీలక సమావేశం నేడు జరగనుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, వాటి ప్రభావం భారత్‌పై ఎలా పడే అవకాశముందనే అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.

AndhraPravasi News Desk 2 min read
Central Govt: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై కేంద్ర కేబినెట్ కీలక సమావేశం!

పశ్చిమాసియా యుద్ధం, ప్రభావ పరిస్థితులపై ప్రధాన చర్చ..

ఇంధన పొదుపు, పెట్రో ధరలు, ప్రభుత్వ నియంత్రణ చర్యలపై చర్చకు అవకాశం..

దేశం మొత్తం దృష్టి సారించిన కేంద్ర కేబినెట్ కీలక సమావేశం నేడు జరగనుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, వాటి ప్రభావం భారత్‌పై ఎలా పడే అవకాశముందనే అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టింది.

గత మూడు రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ఇంధన పొదుపు, అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవడం వంటి సూచనలు చేస్తూ వస్తున్నారు. పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావంతో చమురు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్రం కూడా అప్రమత్తమైంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్‌లో విస్తృత చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. ప్రజలకు మాత్రమే కాకుండా, కేంద్ర ప్రభుత్వ శాఖలు కూడా ఇంధన వినియోగాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇప్పటికే కేంద్ర మంత్రులు, వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అవసరం లేని ప్రయాణాలు తగ్గించడం, సమావేశాలు మరియు సమీక్షా సమావేశాలను వీలైనంత వరకు వర్చువల్ మోడ్‌లో నిర్వహించడం వంటి సూచనలు అందించినట్లు సమాచారం.

పెట్రోలియం ఉత్పత్తుల ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉందనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా సుమారు ₹30 వేల కోట్ల వరకు నష్టాలు చూస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నష్టాలను ఆయా కంపెనీలు ఎక్కువకాలం భరించలేవని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక తాజా పరిస్థితులపై పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు మరియు ఇతర భాగస్వామ్య పక్షాలతో కూడా కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తగ్గించేందుకు ముందస్తు కార్యాచరణ రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్‌కు సంబంధించిన అంశంపై కూడా కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. భద్రతా పరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ విషయంపై కేంద్రం ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

దేశంలో ఇంధన వినియోగం, ఆర్థిక పరిస్థితులు, భద్రతా అంశాలపై ఒకేసారి దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం, పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…