LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Polavaram Updates: పోలవరం నిర్వాసితులకు ఉగాది కానుక రూ 226కోట్లు.. నిర్వాసితుల మోముల్లో ఆనందం..

Polavaram Updates: ఐదేళ్ల జగన్ అరాచక పాలనలో పోలవరం నిర్వాసితులు పండుగులు చేసుకోవడం మర్చిపోయారని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు..

AndhraPravasi News Desk 2 min read
Polavaram Updates: పోలవరం నిర్వాసితులకు ఉగాది కానుక రూ 226కోట్లు.. నిర్వాసితుల మోముల్లో ఆనందం..
  • గత 5 ఏళ్ళు జగన్ పోలవరం నిర్వాసితులను ఎందుకు పట్టించుకోలేదు…
     
  • ఈ నెలాఖరుకి డయా ఫ్రం వాల్ పూర్తి చేస్తాం..

Polavaram Updates: ఐదేళ్ల జగన్ అరాచక పాలనలో పోలవరం నిర్వాసితులు పండుగులు చేసుకోవడం మర్చిపోయారని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.. ఉగాది కానుకగా పోలవరం నిర్వాసితులకు 226 కోట్ల రూపాయలు చెక్కును గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా బుధవారం వారి  ఖాతాల్లో జమ చేసే విధంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులతో కలసి మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల సంక్షేమం రెండూ తమకు ముఖ్యమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు దిశా నిర్దేశం చేశారన్నారు. వచ్చే ఏడాది 2027 నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా  శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. పోలవరం పూర్తయ్యే లోపు గానే నిర్వాసితులకు పునరావాసం, పరిహారం చెల్లించే విధంగా  ప్రణాళికతో పని చేస్తున్నామన్నారు.

2014-19 లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే 700 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గడిచిన 21 నెలలలో 1940 కోట్లు నిర్వాసితులకు అందజేసి, వారికి అండగా నిలిచిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. 2025 సంక్రాంతికి 800 కోట్లు, దీపావళికి 914 కోట్లు, 2026 ఉగాది సందర్భంగా నేడు 226 కోట్లు వెరసి 1940 కోట్లు నిర్వాసితుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. జగన్ పాలనలో నిచ్చేస్టులు అయిపోయిన నిర్వాసితులు నేడు మళ్ళీ నిండు ఆనందంతో కనిపిస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకి 2014-19 తెలుగుదేశం హయాంలో కేంద్ర నిధులు సకాలంలో రాలేకపోయినా అప్పటి  తెలుగు దేశం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ నుంచి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి, పనులు సాగించిందన్నారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు చేసిన 3880 కోట్లు జగన్ హయాంలో కేంద్రం రియంబర్స్ చేయగా ఆ నిధులను, ప్రాజెక్టు పనులకు కేటాయించలేదు. నిర్వాసితులకు పరిహారము చెల్లించకుండా ఎక్కడికి మళ్ళించారో ఏం చేశారో కూడా తెలియకుండా చేశారని రామానాయుడు విమర్శించారు.

మాట్లాడితే నా ఎస్సీలు, నా ఎస్టీలు అని మొసలి కన్నీరు కార్చే  జగన్మోహన్ రెడ్డి  నిర్వాసితులు అత్యధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ సోదరులకు చేసిన అన్యాయం అంతా అంతా కాదన్నారు. ఈ విషయమై జగన్ రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా పోలవరం నిర్వాసితులకు  సమాధానం చెప్పాలని మంత్రి నిలదీశారు.. అప్పటివరకు పోలవరం ఊసెత్తే అర్హత జగన్ కి లేదని  ఆయన అన్నారు. ఈ ఉగాది కానుకగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  పోలవరం నిర్వాసితులకు మరో కానుక  ప్రకటించారని రామానాయుడు చెప్పారు. పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఇప్పటివరకు ఇంటి నిర్మాణానికి  2,85,000 మాత్రమే చెల్లించేవారు అన్నారు. ఈ మొత్తాన్ని 3,57,000 కు పెంచారని ఆయన చెప్పారు. అలాగే  ఓ టి ఎస్ కింద.. అంటే కాలనీలో ఐదు సెంట్లు ఇళ్ల స్థలం అక్కర్లేకుండా వేరే చోటకి వెళదాం అనుకున్న వారికి అదనంగా ఇచ్చే లక్ష రూపాయలను రెండు లక్షలకు  పెంచినట్లు కూడా మంత్రి చెప్పారు. దీంతో ఓ టి ఎస్ మొత్తం 5.57 లక్షలకు పెంచిన ఘనత  గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అని అన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…