ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు జైలు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఎర్రచందనం స్మగ్లర్‌కు సెల్‌ఫోన్లు అందించారన్న ఆరోపణలపై డిప్యూటీ సూపరింటెండెంట్ రమేశ్, జైలర్ రఫీకి సస్పెండ్ చేస్తున్నట్లు జైళ్లశాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు.
జైలర్ రఫీ ఇటీవలే కడప నుంచి అనంతపురం జైలుకు బదిలీ అయ్యారు. ఇదే ఆరోపణలతో నిన్న ఐదుగురు సిబ్బందిని కూడా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్మగ్లర్ జాకీర్ నుంచి జైలు సిబ్బంది మొత్తం 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 3 ఫోన్లను కడప రిమ్స్ పోలీసులకు అప్పగించారు. ఇదే వ్యవహారంపై కడప జైలులో డీఐజీ రవికిరణ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.