కొద్దిరోజులుగా టీవీ డిబేట్లలో కూటమి నేతలను మరియు కొన్ని మీడియా ఛానెల్స్ ను కించపరిచే విధంగా మాట్లాడుతున్న పొలిటికల్ అనలిస్ట్ KS ప్రసాద్ కు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇటీవల జరిగిన ఒక టీవీ డిబేట్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఈ మధ్యకాలంలో, ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ వలే టీవీ డిబేట్లు కూడా కొన్నిసార్లు వాడివేడిగా సాగుతాయి. దీనికి ఉదాహరణే పొలిటికల్ అనలిస్ట్ అని చెప్పుకుని YCP కి అనుకూలంగా మాట్లాడే KS ప్రసాద్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ మధ్య జరిగే డిబేట్ లు మంచి రసవత్తరంగా సాగుతున్నాయి.
కాగా, ఇటీవల ఒక టీవీ ఛానల్ డిబేట్ లో కూటమి నాయకులను ఉద్దేశించి కించపరిచే విధంగా "తెపాల గాళ్ళు" అని KS ప్రసాద్ సంబోధించారు .
అంతే ఘాటుగా స్పందించిన బండారు వంశీకృష్ణ "కూటమి నాయకులను కొన్ని చానళ్లను KS ప్రసాద్ గారు అన్న మాటలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని KS ప్రసాద్ లాంటి "బొగడా" గాళ్ళు అని నేను కూడా అనగలను అన్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాడి వేడి వాదనలు జరుగుతున్న క్రమంలో డిబేట్ నిర్వాహకుడు రంగప్రవేశం తో సద్దుమణిగింది.
ఏది ఏమైనా, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అంటున్నారు నెటిజన్లు. మనం ఒకటి అంటే ప్రత్యర్థులు నాలుగు అంటారు అన్న విషయం KS ప్రసాద్ మరియు బండారు వంశీకృష్ణ ల సంభాషణతో మరోసారి రుజువయ్యింది అంటున్నారు నెటిజన్లు. దీనికి సంబంధించిన ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది.