LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Singapore: సింగపూర్‌లో అత్యాధునిక టువాస్ పోర్టును పరిశీలించిన ఏపీ మంత్రుల బృందం!

Singapore: ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత పోర్టు సంస్థ PSA ఇంటర్నేషనల్ (పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీ)ను సందర్శించింది.

AndhraPravasi News Desk 1 min read
Singapore: సింగపూర్‌లో అత్యాధునిక టువాస్ పోర్టును పరిశీలించిన ఏపీ మంత్రుల బృందం!

2040 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద, పూర్తిగా ఆటోమేటెడ్ టెర్మినల్‌..

పోర్టులో కంటైనర్ల తరలింపుకు డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం..

సింగపూర్: ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత పోర్టు సంస్థ PSA ఇంటర్నేషనల్ (పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీ)ను సందర్శించింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే పోర్టు నిర్వాహకుల్లో PSA ఒకటిగా గుర్తింపు పొందింది.

ఈ సందర్భంగా PSA ఆధ్వర్యంలో నడుస్తున్న (Tuas Port) టువాస్ పోర్టును మంత్రులు నేరుగా పరిశీలించారు. 2040 నాటికి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, పూర్తిగా ఆటోమేటెడ్ టెర్మినల్‌గా రూపుదిద్దుకోనున్నట్లు అధికారులు వివరించారు.

పోర్టులో అమలు చేస్తున్న ఆధునిక సాంకేతికతలు మంత్రులను ఆకట్టుకున్నాయి. కంటైనర్ల రవాణాకు డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, రిమోట్ కంట్రోల్ ద్వారా క్రేన్లను నిర్వహించడం వంటి విధానాలు అక్కడ అమలులో ఉన్నాయి. అలాగే షిప్పింగ్, లాజిస్టిక్స్, ప్రభుత్వ విభాగాల మధ్య సమాచారం వేగంగా డిజిటల్ రూపంలో మార్పిడి అవుతుండడం విశేషంగా నిలిచింది.

అదే విధంగా, రద్దీని తగ్గించేందుకు మరియు కంటైనర్ల కదలికలను ముందుగానే అంచనా వేయడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ సిస్టమ్‌లు ఉపయోగిస్తున్నట్లు PSA ప్రతినిధులు వివరించారు. సోలార్ ఎనర్జీ వినియోగంతో ఈ పోర్టును ‘గ్రీన్ పోర్ట్’గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ పర్యటనలో మంత్రులు పీ నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి, కింజరాపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్య కుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్శన ద్వారా అత్యాధునిక పోర్టు నిర్వహణ విధానాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పోర్టుల అభివృద్ధికి ఉపయోగపడే అనుభవాన్ని మంత్రులు సేకరించినట్లు సమాచారం.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…