LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

TDP: వైఎస్ కుటుంబంపై కాల్వ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు నేర సామ్రాజ్యం!

TDP: అనంతపురంలో ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

AndhraPravasi News Desk 1 min read
TDP: వైఎస్ కుటుంబంపై కాల్వ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు నేర సామ్రాజ్యం!

అనంతపురంలో వైఎస్ కుటుంబంపై విప్ కాల్వ ఘాటు విమర్శలు..

వైఎస్ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..

అనంతపురంలో ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబానికి ఆరు దశాబ్దాల రక్త చరిత్ర ఉందని, మూడు తరాలుగా నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న కుటుంబమని ఆరోపించారు.

మీడియాతో మాట్లాడిన కాల్వ శ్రీనివాస్, “నేను పుట్టక ముందే రాజారెడ్డిపై రౌడీషీట్ ఉండేది. సెటిల్‌మెంట్లు, దౌర్జన్యాలు చేస్తున్నాడనే కారణాలతోనే పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు” అని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి నుంచే ఈ నేర చరిత్ర ప్రారంభమైందని విమర్శించారు.

వైఎస్ కుటుంబం చేయని నేరం లేదంటే అతిశయోక్తి కాదని ఆయన వ్యాఖ్యానించారు. “భారత చట్టాలకు సవరణలు చేసినా, వైఎస్ కుటుంబం చేసిన నేరాలకు పడే శిక్ష తక్కువే అవుతుంది” అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

రాజకీయాల్లో హింసను మొదట ప్రవేశపెట్టింది వైఎస్ రాజారెడ్డేనని కాల్వ శ్రీనివాస్ ఆరోపించారు. ఆర్థిక అవసరాల కోసం ఆయన విచ్చలవిడిగా నేరాలకు పాల్పడ్డాడని, హత్యలు, దొమ్మీలు, దోపిడీలు చేసిన వ్యక్తినే జగన్ మంచి నాయకుడిగా చూపిస్తున్నారని విమర్శించారు.

అలాగే రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డికి పోలీసులపై దాడి చేసిన చరిత్ర కూడా ఉందని పేర్కొన్నారు. పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు వైఎస్ కుటుంబం తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుందని ఆరోపించారు.

కాల్వ శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరలేచిన పరిస్థితి కనిపిస్తోంది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…