LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Minister Savitha: కురుబల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.. మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు!

Minister Savitha: కురుబ సామాజిక వర్గ అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు.

AndhraPravasi News Desk 2 min read
Minister Savitha: కురుబల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.. మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు!

కురుబల ఉన్నతి టీడీపీతోనే..

కురుబ సామాజిక వర్గ అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. కురుబలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపు కల్పించిన నాయకులు అన్న ఎన్టీఆర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడేనని ఆమె పేర్కొన్నారు.

బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో నిర్వహించిన శ్రీ కామ్రవతీ సమేత బీరయ్య స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో మంత్రి సవిత ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడారు.

విద్య ద్వారానే కురుబ సామాజిక వర్గానికి చెందిన యువత ఉన్నత స్థాయికి చేరుకోగలరని మంత్రి సవిత అన్నారు. ప్రతి కుటుంబం తమ పిల్లలను ఉన్నత విద్య చదివించేందుకు ప్రోత్సహించాలని సూచించారు. బీసీల అభివృద్ధికి అన్న ఎన్టీఆర్ ప్రత్యేక కృషి చేశారని, టీడీపీ ఆవిర్భావం తర్వాతే వెనుకబడిన వర్గాలకు రాజకీయ అవకాశాలు పెరిగాయని గుర్తుచేశారు.

తన తండ్రి, మాజీ మంత్రి రామచంద్రారెడ్డికి అన్న ఎన్టీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాకుండా మంత్రిగా కూడా అవకాశం కల్పించారని చెప్పారు. అనంతరం చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో కూడా పలు శాఖలకు మంత్రిగా పనిచేసే అవకాశం దక్కిందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అండదండల వల్లే తమ కుటుంబానికి, కురుబ సమాజానికి గౌరవం లభించిందన్నారు.

టీడీపీలో నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని మంత్రి సవిత పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని చెప్పారు.

భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు శాశ్వత జీవో జారీ చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. తిరుపతిలో కనకదాస కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం మంత్రి నారా లోకేశ్ సహకారంతో స్థలం కేటాయించబడిందని తెలిపారు. అలాగే త్వరలోనే గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

కాకులపాడు బీరయ్య దేవస్థానం నిర్మాణంలో భాగస్వాములైన నిర్వాహకులను మంత్రి అభినందించారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విద్యలో ప్రతిభ కనబరుస్తున్న కురుబ విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి సవిత, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించి గజమాలతో సత్కరించారు. అనంతరం బీరయ్య స్వామి దేవస్థానంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కురుబ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్పతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, కురుబ సామాజిక వర్గానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…