LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Minister Savitha: టీడీపీతోనే కురుబలకు రాజకీయ ప్రాధాన్యం.. మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు!

Minister Savitha: కురుబ సమాజానికి రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీనే అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత-జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు.

AndhraPravasi News Desk 2 min read
Minister Savitha: టీడీపీతోనే కురుబలకు రాజకీయ ప్రాధాన్యం.. మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు!

స్థానిక ఎన్నికల్లోనూ అవకాశాలు..

దేవస్థాన బోర్డుల్లో సభ్యత్వం హామీ..

కుప్పం/చిత్తూరు: కురుబ సమాజానికి రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీనే అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత-జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కురుబలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని ఆమె తెలిపారు.

చిత్తూరు జిల్లా కుప్పం మండల కేంద్రంలో నిర్వహించిన కోడెళ్ల రాయస్వామి ఉత్సవాల్లో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, ఈ ఉత్సవంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. గత ఏడాది జరిగిన ఉత్సవాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆలయ అభివృద్ధి కోసం సీఎం నిధులు మంజూరు చేసి, మౌలిక వసతులు కల్పించారని తెలిపారు. దీనికి కురుబ సమాజం తరఫున సీఎం‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

టీడీపీ ఆవిర్భావం నుంచి కురుబలకు రాజకీయ అవకాశాలు ఇస్తోందని మంత్రి చెప్పారు. 2014 ఎన్నికల్లో కురుబలకు రెండు ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చి గెలిపించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. తనలాంటి కురుబ వర్గానికి చెందిన వ్యక్తికి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం ఇవ్వడం కూడా అదే ప్రోత్సాహానికి నిదర్శనమన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కురుబలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారికి టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే దేవస్థానాల పాలక మండళ్లలో కూడా కురుబలకు సభ్యులుగా అవకాశాలు కల్పించనున్నట్లు సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. గుడికట్ల పూజారులకు త్వరలో గౌరవ వేతనాలు అందించనున్నామని వెల్లడించారు. గుడికట్ల దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

విద్యతోనే సమాజం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లగలదని మంత్రి సవిత పేర్కొన్నారు. కురుబలు తమ పిల్లలకు మంచి విద్య అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్న ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాత్రను ప్రస్తావించారు. పేదలు, బీసీల విద్య కోసం ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తోందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని విద్యలో రాణించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్, కురుబ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జునతో పాటు అనేక మంది సామాజిక ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…