Smart Ration Cards: ప్రజలకు బిగ్ అలర్ట్... త్వరలోనే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!

Smart Ration Cards: ఈ సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డుల వెనుక ఉన్న అసలు సాంకేతిక మ్యాజిక్ దానిపై ఉండే క్యూఆర్ కోడ్. లబ్ధిదారులు రేషన్ దుకాణానికి వెళ్లినప్పుడు డీలర్ ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? వారికి ఇప్పటివరకు బియ్యం, గోధుమలు, చక్కెర వంటి వస్తువులు ఏయే నెలల్లో ఎంతెంత పంపిణీ అయ్యాయనే పూర్తి హిస్టరీ కంప్యూటర్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.

త్వరలోనే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
త్వరలోనే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
  • తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పండగ.. వచ్చే నెల నుంచే మీ చేతుల్లోకి నయా స్మార్ట్ కార్డ్!
  • ఇక నకిలీ కార్డులకు చెక్.. రేషన్ షాపుల్లో అమల్లోకి రాబోతున్న మెగా చేంజ్ ఇదే!
  • కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేశారా? గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

Smart Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న కోట్లాది మంది ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పాత పేపర్ ఆధారిత పద్ధతికి పూర్తిగా స్వస్తి పలుకుతూ, అత్యంత సురక్షితమైన మరియు ఆధునిక సాంకేతికతతో కూడిన 'స్మార్ట్ రేషన్ కార్డుల' (Smart Ration Cards) పంపిణీకి పౌరసరఫరాల శాఖ సర్వం సిద్ధం చేసింది. ఈ నూతన కార్డుల పంపిణీ ఎప్పుడు ప్రారంభం కానుంది, వీటి వల్ల లభించే విప్లవాత్మక మార్పుల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

క్రెడిట్ కార్డు సైజులో సరికొత్త డిజిటల్ కార్డులు

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నివేదికల ప్రకారం, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ ఇప్పటికే విజయవంతంగా పూర్తయింది. ఈ కొత్త కార్డులు చూడటానికి మన డెబిట్ లేదా క్రెడిట్ కార్డు సైజులో ప్లాస్టిక్ కార్డులుగా ఉంటాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులను ఈ విధంగా ఆధునిక డిజిటల్ స్మార్ట్ కార్డు రూపంలో అందించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ కార్డు ముందుభాగంలో కుటుంబ యజమాని ఫోటోతో పాటు పేరు, చిరునామా స్పష్టంగా ముద్రించబడి ఉంటాయి.

క్యూఆర్ కోడ్ (QR Code) తో అక్రమాలకు బ్రేక్

ఈ సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డుల వెనుక ఉన్న అసలు సాంకేతిక మ్యాజిక్ దానిపై ఉండే క్యూఆర్ కోడ్. లబ్ధిదారులు రేషన్ దుకాణానికి వెళ్లినప్పుడు డీలర్ ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? వారికి ఇప్పటివరకు బియ్యం, గోధుమలు, చక్కెర వంటి వస్తువులు ఏయే నెలల్లో ఎంతెంత పంపిణీ అయ్యాయనే పూర్తి హిస్టరీ కంప్యూటర్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. దీనివల్ల రేషన్ వ్యవస్థలో దొంగచాటుగా జరిగే అక్రమాలకు, నకిలీ కార్డుల దందాకు పూర్తిగా ముగింపు పడనుంది. లబ్ధిదారులు ఈ కార్డు ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా కార్డు నంబర్ చెప్పి, బయోమెట్రిక్ (వేలిముద్ర) సహాయంతో సులభంగా రేషన్ తీసుకోవచ్చు.

సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం

కొత్త కార్డుల ముద్రణ పూర్తి కావడంతో పౌరసరఫరాల శాఖ ఇప్పటికే ఈ కార్డులను ఆయా జిల్లాల అధికార యంత్రాంగానికి చేరవేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ తేదీని అధికారికంగా ఖరారు చేసిన వెంటనే, రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల చేతుల్లోకి ఈ కార్డులు రానున్నాయి. కాగా, ఈ నూతన కార్డుల తయారీ ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోందని, కార్డుదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

కొత్త దరఖాస్తుదారులకు కూడా లబ్ధి

చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని వెచి చూస్తున్న లక్షలాది మంది అర్హుల డేటాను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. పాత కార్డులు ఉన్న 3.39 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఈ స్మార్ట్ కార్డులు అందజేయడంతో పాటు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులకు కూడా త్వరలోనే ఈ డిజిటల్ కార్డులను జారీ చేసేందుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ఈ స్మార్ట్ కార్డు కేవలం సరుకులకే కాకుండా, ప్రభుత్వం అందించే ఇతర సంక్షేమ పథకాలకు కూడా ఒక ప్రామాణిక అర్హత పత్రంగా ఉపయోగపడనుంది.

Tags

Be the first to react

Latest