Voter List: 2026 SIR డ్రాఫ్ట్ లో మార్పులతో గజిబిజి! మీ ఓటు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

Voter List: 2026 సవరణ ఓటర్ల జాబితా (SIR 2026) డ్రాఫ్ట్ విడుదలైన నేపథ్యంలో ఓటర్లు తమ వివరాలను మరోసారి పరిశీలించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. తాజా సర్వే తర్వాత పలువురు ఓటర్ల పార్ట్ నంబర్లు, సీరియల్ నంబర్లు మారినట్లు సమాచారం. దీంతో పాత ఓటర్ స్లిప్ లేదా పాత ఎన్యూమరేషన్ ఫారమ్‌లోని వివరాలను మాత్రమే నమ్ముకోవద్దని సూచిస్తున్నారు.

Voter List
Voter List

ఓటర్లకు అలర్ట్.. SIR 2026 డ్రాఫ్ట్‌లో పార్ట్, సీరియల్ నంబర్లు మారాయి.. ఇప్పుడే చెక్ చేయండి..

SIR 2026 డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల.. మీ పేరు ఉందా? ఇలా చెక్ చేసుకోండి..

Voter List: 2026 సవరణ ఓటర్ల జాబితా (SIR 2026) డ్రాఫ్ట్ విడుదలైన నేపథ్యంలో ఓటర్లు తమ వివరాలను మరోసారి పరిశీలించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. తాజా సర్వే తర్వాత పలువురు ఓటర్ల పార్ట్ నంబర్లు, సీరియల్ నంబర్లు మారినట్లు సమాచారం. దీంతో పాత ఓటర్ స్లిప్ లేదా పాత ఎన్యూమరేషన్ ఫారమ్‌లోని వివరాలను మాత్రమే నమ్ముకోవద్దని సూచిస్తున్నారు.

ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ముందుగానే తెలుసుకోవడం ద్వారా ఎన్నికల సమయంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోయినా అర్హత ఉన్న వారు నిర్ణీత గడువులో కొత్తగా నమోదు చేసుకునే అవకాశం ఉంది.

1950కి SMS చేస్తే కొత్త వివరాలు
ఓటర్లు తమ EPIC నంబర్ (Voter ID నంబర్) ద్వారా తాజా పార్ట్, సీరియల్ నంబర్లను తెలుసుకోవచ్చు.
అందుకు మొబైల్ నుంచి 1950కు ఈ ఫార్మాట్‌లో SMS పంపాలి:
ECI <space> EPIC నంబర్
SMS పంపిన తర్వాత ఓటరుకు ప్రత్యుత్తర సందేశం వస్తుంది. అందులో సాధారణంగా కొత్త పార్ట్ నంబర్, సీరియల్ నంబర్, నియోజకవర్గం పేరు, నియోజకవర్గ నంబర్, జిల్లా, రాష్ట్రం వంటి వివరాలు అందుతాయి.

కొత్త నంబర్‌తో ఓటరు జాబితా PDF చూడాలి
SMS ద్వారా కొత్త పార్ట్, సీరియల్ నంబర్లు తెలుసుకున్న తర్వాత ఓటర్లు ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ voters.eci.gov.inను సందర్శించాలి. అక్కడ తమ పోలింగ్ స్టేషన్‌కు సంబంధించిన ఓటర్ల జాబితా PDFను కొత్త పార్ట్ నంబర్ ఆధారంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ PDFలో కొత్త సీరియల్ నంబర్ ద్వారా తమ పేరును సులభంగా గుర్తించవచ్చు. పార్ట్, సీరియల్ నంబర్లు మారిన నేపథ్యంలో పాత ఓటర్ స్లిప్‌లో ఉన్న నంబర్లతోనే వెతకడం వల్ల సరైన సమాచారం దొరకకపోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

పేరు లేకపోతే ఏం చేయాలి?
SIR 2026 డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పేరు కనిపించకపోయినా అర్హత ఉన్నవారికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. గతంలో ఓటరుగా నమోదు కాకపోయినా, ఎన్యూమరేషన్ ఫారం సమర్పించకపోయినా కొత్తగా నమోదు చేసుకోవచ్చు. అలాగే డ్రాఫ్ట్ జాబితాలో ఉన్న వివరాలపై అభ్యంతరం ఉంటే కూడా నిర్ణీత గడువులో అభ్యంతరం దాఖలు చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు
సెప్టెంబర్ 16: కొత్త ఓటరు నమోదు దరఖాస్తులు, డ్రాఫ్ట్ జాబితాపై అభ్యంతరాలకు చివరి తేదీ.
అక్టోబర్ 15: ఎన్నికల నమోదు అధికారులు (EROs) దరఖాస్తులు, అభ్యంతరాలపై నోటీసులు జారీ చేసి విచారణ లేదా హియరింగ్ పూర్తి చేయాల్సిన గడువు.
అక్టోబర్ 19: తుది SIR ఓటర్ల జాబితా విడుదల. అందువల్ల పేరు లేకపోయిన వారు సెప్టెంబర్ 16లోగా దరఖాస్తు లేదా అభ్యంతరం దాఖలు చేయడం కీలకం.

కొత్త ఓటరుగా ఎలా నమోదు చేసుకోవాలి?
కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సిన వారు ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ ద్వారా Form 6 సమర్పించవచ్చు. అలాగే Voter Helpline App ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేటప్పుడు ఫొటో, వయస్సు ధ్రువీకరణ, చిరునామా ధ్రువీకరణ వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి.

వయస్సు ధ్రువీకరణకు జనన ధ్రువీకరణ పత్రం, PAN, పాస్‌పోర్ట్, ఆధార్ వంటి పత్రాలను ఉపయోగించవచ్చు. చిరునామా ధ్రువీకరణకు ఆధార్, పాస్‌పోర్ట్, విద్యుత్ లేదా ఇతర యుటిలిటీ బిల్లులు, బ్యాంక్ పాస్‌బుక్ వంటి పత్రాలను ఉపయోగించే అవకాశం ఉంది.

BLO ఇంటికి వచ్చి వివరాలు పరిశీలిస్తారు 
దరఖాస్తు సమర్పించిన తర్వాత సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)కు ధృవీకరణ బాధ్యత అప్పగిస్తారు. అవసరమైన సందర్భంలో BLO ఇంటికి వచ్చి అసలు పత్రాలను పరిశీలించి వివరాలను నిర్ధారిస్తారు. తర్వాత అర్హత నిర్ధారణ ప్రక్రియ పూర్తయితే ఓటరు పేరు తుది జాబితాలో చేర్చబడుతుంది.

ఇప్పుడే ఓటరు వివరాలు చెక్ చేసుకోవడం మంచిది
SIR 2026 డ్రాఫ్ట్ జాబితా తర్వాత పార్ట్ నంబర్లు, సీరియల్ నంబర్లలో మార్పులు చోటుచేసుకున్నందున ఎన్నికల సమయం వరకు వేచి చూడకుండా ఇప్పుడే వివరాలను పరిశీలించుకోవడం మంచిది.

ఓటరు పేరు జాబితాలో ఉందా? కొత్త పార్ట్ నంబర్ ఏంటి? సీరియల్ నంబర్ మారిందా? వంటి వివరాలను ముందుగానే నిర్ధారించుకోవడం ద్వారా చివరి నిమిషంలో ఎదురయ్యే ఇబ్బందులను నివారించవచ్చు.

సెప్టెంబర్ 16 గడువును మిస్ కాకుండా పేరు లేని అర్హులైన వారు కొత్తగా నమోదు చేసుకోవడం లేదా అవసరమైన అభ్యంతరాలను దాఖలు చేయడం ద్వారా తుది జాబితాలో తమ హక్కును నిర్ధారించుకోవచ్చు.

Be the first to react

Latest