LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

TDP: పెద్ద దస్తగిరి హత్య వెనుక భూ కుంభకోణం? జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ తీవ్ర ఆరోపణలు!

TDP: కడపలో జరిగిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యపై రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

AndhraPravasi News Desk 2 min read
TDP: పెద్ద దస్తగిరి హత్య వెనుక భూ కుంభకోణం? జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ తీవ్ర ఆరోపణలు!

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి..

పెద్ద దస్తగిరి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదు జగన్?

మంగళగిరి: కడపలో జరిగిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యపై రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో భాగంగానే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని ఆయన అన్నారు.

రెండు వారాల క్రితం కడప పట్టణంలో జరిగిన ఈ హత్యను కొంతమంది మాఫీ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసు తరహాలోనే ఈ హత్య కూడా జరిగిందని పోల్చారు. “మొదట గుండెపోటు అని చెప్పి, తరువాత గొడ్డలి దాడి జరిగినట్టు చెప్పినట్లే... ఇప్పుడు కూడా నిజాలను మసకబార్చే ప్రయత్నం జరుగుతోంది” అని విమర్శించారు.

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆస్తుల వ్యవహారంలోనే ఈ హత్య జరిగిందని ఆయన పేర్కొన్నారు. కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డికి బినామీగా పని చేస్తూ పెద్ద స్థాయిలో భూ దందాలు చేశారని ఆరోపించారు. పెద్ద దస్తగిరి పేరుతో వందల కోట్ల ఆస్తులు పెట్టి, ఆ లావాదేవీలలో తలెత్తిన వివాదాల వల్లే ఈ హత్య జరిగిందని చెప్పారు.

ఈ ఘటనపై వైసీపీ నేతలు సరైన స్పందన ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. “ఇతరులు చనిపోతే వెంటనే పరామర్శించే జగన్... పులివెందులలో ఉండి కూడా పెద్ద దస్తగిరి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదు?” అని నిలదీశారు. హత్యను ఖండించకపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

రవీంద్రనాథ్ రెడ్డికి ఎలాంటి వ్యాపారాలు లేకపోయినా వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

రాయలసీమకు నీళ్ల పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన పనులను కూడా భూమిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. 2020లో రూ.3,885 కోట్లతో లిఫ్ట్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి, పర్యావరణ అనుమతులు లేకుండానే టెండర్లు ఇచ్చారని అన్నారు. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కంపెనీకి ఈ పనులు అప్పగించారని ఆరోపించారు.

తరువాత నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఈ ప్రాజెక్టుపై స్టే ఇచ్చినా కూడా రూ.900 కోట్ల బిల్లులు డ్రా చేసుకున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై ఎన్జీటీ రూ.2.65 కోట్ల జరిమానా కూడా విధించిందని గుర్తు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు అసలు లక్ష్యం రాయలసీమకు నీళ్లు ఇవ్వడం కాదని, చెన్నైకి తాగునీరు అందించడమేనని ఆరోపించారు. ఈ విషయాన్ని 2023లో జీఓల ద్వారా స్పష్టం చేశారని తెలిపారు.

రాయలసీమకు జరిగిన అన్యాయంపై భూమిరెడ్డి తీవ్రంగా స్పందించారు. “2019-24 మధ్య ఒక ఆయకట్టుకైనా అదనంగా నీరు ఇచ్చినట్టు నిరూపిస్తే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను” అని సవాల్ విసిరారు. అలాగే, వేదవతి, గుండ్రేవుల వంటి ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, మొత్తం 102 సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసిందని ఆరోపించారు. ఇది రాయలసీమకు చేసిన తీరని ద్రోహమని వ్యాఖ్యానించారు.

పెద్ద దస్తగిరి హత్య, భూ దందాలు, రాయలసీమ నీటి సమస్యలపై భూమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలపై వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…