లోక్‌సభ సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల వ్యవస్థ, ప్రజాస్వామ్య పరిరక్షణ, మరియు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై గట్టిగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడుతున్నాయన్న ఆందోళనను ఆయన బహిరంగంగా వెల్లడించారు. ఎన్నికల సంస్కరణల గురించి కేంద్రం గొప్పలు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని రాహుల్ అభిప్రాయపడ్డారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, HAL, BHEL, ONGC వంటి పబ్లిక్ రంగ సంస్థలపై కూడా చర్చ జరగాలని కోరారు. దేశ అభివృద్ధికి ప్రధానమైన ఈ సంస్థలు పారదర్శకంగా నడవాలని, ప్రభుత్వం వాటిని ఎలా నిర్వహిస్తున్నదన్న విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాని ప్రశ్నలు అడగడం సహజమని ఆ ధోరణి తగ్గిపోతే ప్రజల నమ్మకం దెబ్బతింటుందని ఆయన వ్యాఖ్యానించారు.
మీడియా, దర్యాప్తు సంస్థలు, ఎన్నికల కమిషన్, యూనివర్సిటీలు వంటి అనేక కీలక వ్యవస్థలపై ఒకే విధమైన సిద్ధాంతం పెత్తనం ప్రదర్శిస్తోందన్న ఆరోపణను రాహుల్ గాంధీ ముందుకు తెచ్చారు. దేశంలోని ప్రతి వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలని, వాటి పైన ఒత్తిడి పెరగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని గాంధీ చెప్పారు. ఎన్నికల కమిషన్ తటస్థత వ్యవహరించకపోతే ఎన్నికల నమ్మకం తగ్గిపోతుందని, ఓట్ల చోరీ వంటి ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు తమ పార్టీ వద్ద ఉన్నాయని ఆయన అన్నారు.
RSS సిద్ధాంతంపై కూడా రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. సమానత్వ భావనపై RSS కు నమ్మకం లేదని, భారతదేశాన్ని సమానత్వంతో ముందుకు తీసుకెళ్లాలన్న మహాత్మా గాంధీ ఆశయాన్ని హతమర్చినవారి ఆలోచన ఇప్పటికీ వ్యవస్థలను ప్రభావితం చేస్తోందని ఆయన ఆరోపించారు. గాంధీజీకి వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపించడమే కాకుండా, ఆర్ఎస్ఎస్ నాయకత్వం వ్యవస్థలను తమ ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తోందని రాహుల్ అన్నారు. ప్రజలకు నచ్చని నిజాలను దాచే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
రాహుల్ ప్రసంగం పలువురు బీజేపీ ఎంపీలు అతన్ని అడ్డుకున్నారని సంబంధం లేని విషయాలు చెప్పుతూ వ్యాఖ్యలు మధ్యలో అడ్డుపడ్డాయి. అయితే రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించుకునే బాధ్యత అన్ని పార్టీలు, అన్ని పౌరులదేనని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ధోరణులు పెరగడం భారతదేశ భవిష్యత్తుకు హానికరమైపోతుందని ఆయన హెచ్చరించారు.