LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Rama Temple: భారీ పోలీసు బందోబస్తు.. కట్టుదిట్టమైన నిఘా.. ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై సర్వత్రా ఉత్కంఠ.!

Rama Temple: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువైన రామాలయ పునర్నిర్మాణ పనులకు ఆదివారం ఉదయం శంకుస్థాపన జరిగింది. భారీ పోలీసు బందోబస్త్ మధ్య, వేలాది మంది భక్తుల సమక్షంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, ఆయన అర్ధాంగి ఈ కా…

AndhraPravasi News Desk 1 min read
Rama Temple: భారీ పోలీసు బందోబస్తు.. కట్టుదిట్టమైన నిఘా.. ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై సర్వత్రా ఉత్కంఠ.!
  • ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని రఘురామ స్పష్టీకరణ..
     
  • Politics: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం..

Rama Temple: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో గత కొంతకాలంగా ఉత్కంఠకు దారితీసిన రామాలయ పునర్నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం నిర్ణయించిన 7:14 గంటల శుభ ముహూర్తానికి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తన ధర్మపత్నితో కలిసి శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. గతంలో ఈ ఆలయ నిర్మాణ విషయమై రెండు వర్గాల మధ్య తీవ్ర వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకోవడంతో, ఈసారి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య, వేలాది మంది భక్తుల జయజయధ్వానాలతో ఈ భూమిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కొందరు శక్తులు కోర్టులను ఆశ్రయించి అడ్డంకులు సృష్టించాయని విమర్శించారు. అయితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, భక్తిభావంతో అనుకున్న సమయానికే పనులు ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. ఈ రామాలయాన్ని అత్యంత పటిష్టమైన కృష్ణశిలతో నిర్మిస్తామని, సుమారు 800 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన వెల్లడించారు. ఈ మహత్కార్యం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గత శ్రీరామనవమి వేళ ఇక్కడ జరిగిన అవాంఛనీయ ఘటనలు హైకోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతులతోనే పనులు చేపట్టాలని న్యాయస్థానం గతంలో సూచించింది. ఈ నేపథ్యంలో అధికారుల నుంచి అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే పనులకు శ్రీకారం చుట్టారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఆకివీడు వ్యాప్తంగా నిఘా పెంచారు. ఎట్టకేలకు వివాదాలకు తెరదించి, ఆలయ నిర్మాణ పనులు మొదలుకావడంతో స్థానిక భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భక్తి విశ్వాసాల మధ్య సాగిన ఈ కార్యక్రమం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…