LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Prajavedhika: వైసీపీ నేతల దౌర్జన్యం.. నల్లమాడ రైతు ఇంటి కూల్చివేతపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు!

Prajavedhika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ (ప్రజా వినతుల) కార్యక్రమంలో ప్రజల నుండి భారీగా వినతులు వెల్లువెత్తాయి. ఏపీఐడీసీ ఛైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో భూ వివాదాలు, రాజకీయ వేధింప…

AndhraPravasi News Desk 4 min read
Prajavedhika: వైసీపీ నేతల దౌర్జన్యం.. నల్లమాడ రైతు ఇంటి కూల్చివేతపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు!

Politics - పట్టా భూమికి 'ఇనాం' ముద్ర - పదేళ్లుగా తిరుగుతున్నా తీరని శ్రీనివాసరావు గోడు.

అన్నదమ్ముల మధ్య భూపోరు: 130 ఎకరాల అక్రమ విక్రయంపై మాణిక్యం వినతి.

రికార్డుల్లో మాయమైన 31 సెంట్లు.. అధికారుల చుట్టూ తిరుగుతున్నా అందని న్యాయం.

Prajavedhika: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా బుధవారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం బాధితుల ఆర్తనాదాలతో నిండిపోయింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన ప్రజలు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను నేతలకు విన్నవించుకున్నారు. ఏపీఐడీసీ ఛైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను ఓపికగా విన్నారు. ప్రధానంగా భూ సమస్యలు, గత ప్రభుత్వ నేతల వేధింపులు, రెవెన్యూ అధికారుల అలసత్వంపై బాధితులు ఫిర్యాదులు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి అర్జీపై తక్షణమే చర్యలు తీసుకుంటామని నేతలు హామీ ఇచ్చారు.

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడకు చెందిన రవీంద్రనాధ గుప్తా తనపై జరిగిన దౌర్జన్యాన్ని వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. తన పూర్వీకుల నుండి వచ్చిన సర్వే నంబర్ 270-1 లోని 8.01 ఎకరాల స్థలంలో దశాబ్దాలుగా నివసిస్తున్నానని, అయితే గత మార్చిలో వైసీపీ నేతలు రఘునాధ రెడ్డి, కేశవ రెడ్డి, సోమిరెడ్డిలు జేసీబీలతో వచ్చి తన ఇంటి నిర్మాణాలను అక్రమంగా కూల్చివేశారని ఆరోపించారు. తాను ఇంట్లో లేని సమయంలో తన భార్యను కూడా చూడకుండా దుర్భాషలాడి భయభ్రాంతులకు గురిచేశారని, పునాదులతో సహా నిర్మాణాలను పెకలించి బీభత్సం సృష్టించారని ఆయన వాపోయారు. ఈ అరాచకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

పల్నాడు జిల్లా పెదకూరపాడుకు చెందిన శ్రీనివాసరావు తన పట్టా భూమిని నిషేధిత జాబితాలో చేర్చడంపై ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 491-1లోని 2.05 ఎకరాల భూమిని తన తాతగారు 1971లోనే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, అయితే అధికారులు పొరపాటున దీనిని '22-A' (ఇనాం భూమి) కింద నమోదు చేశారని తెలిపారు. పదేళ్లుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని, శిస్తు చెల్లిస్తున్నా తమ భూమిపై హక్కులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఆధారాలు ఉన్నా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, తక్షణమే తమ భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని విన్నవించారు.

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం డొంకాడ జగన్నాదపురం గ్రామానికి చెందిన మాణిక్యం అనే వ్యక్తి తన సొంత సోదరులే తనను మోసం చేశారని అర్జీ ఇచ్చారు. తన తండ్రి సింహాచలం పేరు మీద ఉన్న 130 ఎకరాల భూమిని తన సోదరులైన నానేపల్లి ఎరకయ్య, నారాయణ కలిసి తనకు తెలవకుండా ఇతరులకు అక్రమంగా అమ్మేశారని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్, తహశీల్దార్ కార్యాలయాల్లో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి విచారణ జరగలేదని, తనకు దక్కాల్సిన వారసత్వ ఆస్తిని తిరిగి ఇప్పించాలని ఆయన నేతలను వేడుకున్నారు. అధికారులు కనీసం స్పందించకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

వైఎస్ఆర్ కడప జిల్లా అట్లూరు మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన సూర్యారెడ్డి తన తండ్రి మరణానంతరం భూమి పట్టా మార్పిడి విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. తన తండ్రి కుడవాల శివరామ రెడ్డి పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీదకు మార్చుకోవడానికి అవసరమైన మరణ ధ్రువీకరణ పత్రం, వారసత్వ పత్రాలన్నీ అందజేసినా రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారని తెలిపారు. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ పట్టా మార్పిడి చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆయన అభ్యర్థించారు.

ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరుకు చెందిన రామకోటేశ్వరరావు తన భూమి విస్తీర్ణం తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రికార్డుల ప్రకారం తనకు 3.00 ఎకరాల భూమి ఉండాలని, కానీ ఇటీవల అధికారులు చేసిన సర్వేలో కేవలం 2.69 ఎకరాలే ఉన్నట్లు తేలిందని వివరించారు. ఈ 31 సెంట్ల వ్యత్యాసంపై పైఅధికారులకు ఫిర్యాదు చేసినా క్షేత్రస్థాయిలో ఎటువంటి పురోగతి లేదని, తమ భూమిని తిరిగి తమకు దక్కేలా చూడాలని ఆయన కోరారు. రికార్డుల్లో ఉన్న భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి పొంతన లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పడమర లక్ష్మీపురానికి చెందిన వెంకటేశ్వర్లు తన ఉమ్మడి ఆస్తి వాటా విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని వెల్లడించారు. తన పూర్వీకుల నుండి వచ్చిన 0.82 సెంట్ల భూమిలో తనకు రావాల్సిన ఐదవ వంతు వాటాకు పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ నుండి కలెక్టర్ వరకు అందరికీ మొరపెట్టుకున్నా కనీసం సమాధానం కూడా రావడం లేదని, రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత లోపించిందని ఆయన ఆరోపించారు. సామాన్య రైతులకు పట్టా పుస్తకాలు ఇవ్వడంలో అధికారులు చూపుతున్న అలసత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్నాడు జిల్లాకు చెందిన వెంకాయమ్మ అనే వృద్ధురాలు తన 4 సెంట్ల భూమిని రికార్డుల్లో నమోదు చేయించుకోవడం కోసం పడుతున్న పాట్లను వివరించారు. సర్వే నంబరు 813-C1లో తనకున్న 97 సెంట్లలో కేవలం 93 సెంట్లు మాత్రమే రికార్డుల్లో ఉందని, మిగిలిన 4 సెంట్లను నమోదు చేయాలని కోరుతూ పది నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని తెలిపారు. పొరుగు రైతులు కూడా అంగీకరించినప్పటికీ అధికారులు సాకులు చెబుతూ తనను తిప్పుకుంటున్నారని, ముసలి వయసులో తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. చిన్నపాటి మార్పుల కోసం కూడా రైతులను ఏళ్ల తరబడి వేచి చూసేలా చేయడం దారుణమని ఆమె పేర్కొన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన రత్న తన డి-పట్టా భూమిపై లోన్ రెన్యువల్ సమస్యను తీసుకొచ్చారు. 2003లో ప్రభుత్వం మంజూరు చేసిన 2.45 ఎకరాల భూమిని తాము నిబంధనలకు అనుగుణంగా సాగు చేసుకుంటున్నామని, అయితే బ్యాంకు లోన్ రెన్యువల్ కోసం రెవెన్యూ అధికారులు క్లియరెన్స్ సర్టిఫికేట్ లేదా అడంగల్ ఇవ్వడం లేదని తెలిపారు. తాము ఏ తప్పు చేయలేదని, కేవలం పాత రికార్డులను పరిశీలించి పత్రాలు ఇస్తే తమకు ఆర్థికంగా ఊరట కలుగుతుందని ఆమె వివరించారు. పేద రైతులకు అందాల్సిన రుణ సదుపాయం రెవెన్యూ పత్రాల జాప్యం వల్ల ఆగిపోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి కేవలం భూ సమస్యలే కాకుండా సామాజిక పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణ సమస్యలపై కూడా వందలాది మంది అర్జీలు అందజేశారు. నిరుద్యోగ యువత తమ ఉద్యోగ అవకాశాల కోసం రెస్యూమ్ లు సమర్పించగా, అనారోగ్యంతో బాధపడుతున్న కొందరు ఆర్థిక సహాయం కోసం విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ, గత ఐదేళ్ల అరాచక పాలన వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి అర్జీని కంప్యూటరీకరించి, వాటి పరిష్కారానికి డెడ్ లైన్ విధిస్తామని నేతలు హామీ ఇవ్వడంతో బాధితులు నమ్మకంతో తిరిగి వెళ్లారు.

 

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…